ప్రభాస్‌ సినిమాలో అలా చేసినందుకు ఇప్పటికీ బాధపడుతున్నాను: అనుష్క శెట్టి

ప్రభాస్‌ సినిమాలో అలా చేసినందుకు ఇప్పటికీ బాధపడుతున్నాను: అనుష్క శెట్టి

అనుష్క శెట్టి తెలుగు తెరకు సుపరిచితమైన నటి. నాగార్జున సూపర్ సినిమాతో ఇండస్ట్రీలో ఎంట్రీ ఇచ్చిన ఈ అమ్మడు ఇండియా స్టార్ ప్రభాస్‌కు జోడీగా మిర్చి, బిల్లా, బాహుబలి 1, బాహుబలి 2 వంటి చిత్రాల్లో నటించింది. బాహుబలి, అనుష్క హిట్ పెయిర్ గా అందరికీ సుపరిచితమే. వీరిద్దరు గత కొద్ది కాలంగా ప్రేమించుకుంటున్నారని వార్తలు కూడా వచ్చాయి. కానీ ఈ జంట అలాంటి వార్తలపై క్లారిటీ ఇచ్చింది.

ఇక కొంత కాలం పాటు సినిమాలకు దూరంగా ఉన్న అనుష్క మళ్లీ ‘మిస్ శెట్టి మిస్టర్ పొలిశెట్టి’ సినిమాతో రీ ఎంట్రీ ఇచ్చింది. ప్రభాస్ సినిమాలో నటించడం వల్ల బాధపడినట్లు ఇటీవల ఓ ఇంటర్వ్యూలో చెప్పింది అనుష్క.

అదేమింటంటే..‘‘ నేను ప్రభాస్, నమిత కలిసి బిల్లా సినిమాలో నటించాం.ఆ సినిమాలో బికినీ వేసుకోవాల్సి వచ్చింది. అందుకు చాలా ఇబ్బంది పడ్డాను. ఈ సినిమాను ఒప్పుకోకపోయి ఉంటే కచ్చితంగా ఈ బికినీ సీన్ కోసమైనా సినిమానే రిజెక్ట్ చేసేదాన్ని. ఈ మూవీ ముందుగానే ఒప్పుకుని బాండ్‌పై సంతకం చేయడం వల్ల చివరికి ఏమి చేయలేకపోయా. నేను ప్రభాస్‌ ఆ సినిమాలో అలా చేసినందుకు ఇప్పటికీ బాధపడుతున్నాను’’ అంటూ చెప్పుకొచ్చింది. ప్రస్తుతం అనుష్క శెట్టి కామెంట్స్ నెట్టింట వైరల్గా మారాయి.