Raja Saab: రాజాసాబ్‌ లేకుండానే కొత్త షెడ్యూల్‌..సంజయ్‌ దత్‌ పాత్ర ఇదేనట!

Raja Saab: రాజాసాబ్‌ లేకుండానే కొత్త షెడ్యూల్‌..సంజయ్‌ దత్‌ పాత్ర ఇదేనట!

డార్లింగ్ ప్రభాస్ (Prabhas) హీరోగా తెరకెక్కుతున్న మూవీ రాజాసాబ్(Rajasaab). ప్రస్తుతం షూటింగ్ దశలో ఉంది ఈ సినిమా. ఇందులో మాళవిక మోహనన్, నిధి అగర్వాల్, ఆషికా రంగనాథ్ హీరోయిన్స్ గా నటిస్తున్నారు.కట్టప్ప సత్యరాజ్, బాలీవుడ్ స్టార్ యాక్టర్ సంజయ్ దత్ కీలక పాత్రలలో కనిపించబోతున్నారట.

గతేడాది అక్టోబర్ లో మూవీ షూటింగ్ స్టార్ట్ అయ్యింది.అయితే,ప్రస్తుతం ఈ మూవీ అప్డేట్స్ ఏంటీ? అసలు షూటింగ్ జరుగుతుందా? డార్లింగ్ ఎప్పుడొస్తాడు అంటూ సోషల్ మీడియాలో పెద్ద ఎత్తున చర్చ నడుస్తోంది. 

తాజా సమాచారం ప్రకారం..ప్రస్తుతం ప్రభాస్ నటిస్తున్న సినిమాల లిస్టు ఎక్కువగా ఉండటంతో..రాజసాబ్కి చాలా వరకు తక్కువ డేట్లు కేటాయిస్తూ వస్తున్నట్లు తెలుస్తోంది.ఆ కారణంగానే షూటింగ్ ఆలస్యం అవుతూ వస్తోంది.ఇంకా ఈ ఏడాది అంతా కూడా షూటింగ్ వర్క్ జరిగేలా కనిపిస్తోంది.

అయితే,రాజాసాబ్‌ కొత్త షెడ్యూల్‌ను హైదరాబాద్‌ లోని అల్యూమినియం ఫ్యాక్టరీలో ఇటీవలే షురూ చేశారట.ఈ షూటింగ్లో బాలీవుడ్ స్టార్ సంజయ్ దత్ తో పాటు కీలక నటీనటులపై కొన్ని సీన్స్ చిత్రీకరిస్తున్నట్లు సమాచారం.కానీ ఈ లేటెస్ట్ షెడ్యూల్‌లో మాత్రం మన డార్లింగ్ రాజాసాబ్‌ పాల్గొనడం లేదట.ఎందుకంటే ప్రభాస్ కల్కి సినిమాతో బిజీగా ఉన్నట్లు తెలుస్తోంది.ఏప్రిల్ లాస్ట్ వీక్ లో ప్రభాస్ షూటింగ్ లో పాల్గొనే అవకాశం ఉందని టాక్.ఇటీవలే రాజాసాబ్ నుంచి వచ్చిన మోషన్ పోస్టర్ ఆడియన్స్ లో మంచి ఇంపాక్ట్ తీసుకొచ్చింది.

రాజాసాబ్ స్టోరీ ఎలా ఉండబోతుంది అనే దానిపై సోషల్ మీడియాలో ఓ న్యూస్ వైరల్ అవుతుంది.ఇందులో సంజూభాయ్‌ ప్రభాస్‌ తాతగా కనిపించబోతున్నాడట.ఆయన అకాల మరణం చెందిన తర్వాత దెయ్యంగా తిరిగి రాగా..అతడు ప్రభాస్‌ జీవితాన్ని ఎలా ప్రభావితం చేశాడనే నేపథ్యంలో రాజాసాబ్ కథ సాగనుందట. ఒకవేళ ఇదే నిజమైతే ప్రభాస్‌ ఫ్యాన్స్ కి సరికొత్త ఫీల్‌ను ఎంజాయ్ చేయడం గ్యారంటీ అని చెప్పొచ్చు. 

ప్రస్తుతం ప్రభాస్ వరుస పెట్టి సినిమాలు చేస్తున్నాడు. కల్కి,రాజాసాబ్ చిత్రీకరణలో ఉండగానే, సలార్ 2, స్పిరిట్, హను రాఘవపుడితో మరో సినిమాను లైన్ లో పెట్టేసాడు. ఇక రాజాసాబ్ వచ్చేదో ఎప్పుడో తెలియాల్సి ఉంది.