War 2: నాటు నాటు రేంజ్ ఉంటుందా?.. దుమ్ములేపనున్న హ్రితిక్, ఎన్టీఆర్

War 2: నాటు నాటు రేంజ్ ఉంటుందా?.. దుమ్ములేపనున్న హ్రితిక్, ఎన్టీఆర్

దర్శకుడుధీరుడు రాజమౌళి(Rajamouli) తెరకెక్కించిన ఆర్ఆర్ఆర్(RRR) సినిమా ఎంత పెద్ద విజయం సాధించిందో ఆ సినిమాలోని  నాటు నాటు(Naatu Naatu) పాట అంతకంటే ఎక్కువ సంచలనం సృష్టించింది. ప్రపంచాన్ని ఊపేసిన ఈ పాట ఏకంగా ఆస్కార్ అవార్డు సాధించింది. నాటు నాటు పాత ఒక ఎత్తైతే.. ఆ పాటలో రామ్ చరణ్(Ram Charan), ఎన్టీఆర్(Ntr) చేసిన డాన్స్ మరోఎత్తు. సంగీత దర్శకుడు ఎంఎం కీరవాణి అందించింది ఫాస్ట్ అండ్ నాటు బీటుకు మెరుపు వేగంతో చరణ్, ఎన్టీఆర్ వేసిన స్టెప్స్ నెక్స్ట్ లెవల్ అనే చెప్పాలి. ఈ ఇద్దరు స్టార్స్ వేసిన మ్యాజికల్ స్టెప్స్ కి ఆడియన్స్ ఫిదా అయ్యారు. అంతేకాదు.. ఈ రేంజ్ లో మరో సాంగ్ రావడం కూడా కష్టమే అనేంతలా మ్యాజిక్ చేసింది ఈ పాట. 

అయితే తాజాగా అందుతున్న సమాచారం మేరకు ఆర్ఆర్ఆర్ లోని నాటు నాటు సాంగ్ లెవల్లో ఉండేలా మరో సాంగ్ కూడా రాబోతుందట. అవును.. యంగ్ టైగర్ ఎన్టీఆర్, బాలీవుడ్ స్టార్ హ్రితిక్ రోషన్ కాంబోలో వార్ 2 సినిమా వస్తున్న విషయం తెలిసిందే. వార్ సినిమాకు సీక్వెల్ గా వస్తున్న వార్ 2 మూవీని దర్శకుడు అయాన్ ముఖర్జీ తెరకెక్కిస్తున్నారు. అవుట్ అండ్ అవుట్ యాక్షన్ ఎంటర్టైనర్ గా వస్తున్న ఈ సినిమాపై దేశవ్యాప్తంగా భారీ అంచనాలు నెలకొన్నాయి. అందుకే ఈ సినిమా గురించి వినిపిస్తున్న చిన్న న్యూస్ అయినా క్షణాల్లో వైరల్ అవుతోంది. 

తాజాగా అలంటి న్యూస్ ఒకటి ఇండస్ట్రీ వర్గాల్లో హాట్ టాపిక్ గా మారింది. అదేంటంటే.. ఎన్టీఆర్, హ్రితిక్ ఇద్దరు డాన్స్ లు ఇరగదీశాడు. వీళ్ళ డాన్స్ మూవ్స్ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. ఎంత కష్టతమైన స్టెప్స్ నైనా ఈజీగా వేసి ఆడియన్స్ చేత శబాష్ అనిపించుకోవడం ఈ స్టార్స్ కు అలవాటే. అందుకే.. నాటు నాటు పాటను మించేలా వార్ 2 సినిమాలో ఈ ఇద్దరు స్టార్స్ తో ఓ సాంగ్ ప్లాన్ చేస్తున్నారట మేకర్స్. ఈ పాటలో ఈ ఇద్దరి డాన్స్ కళ్లుచెదిరే రేంజ్ లో ఉండనున్నాయట. ఈ న్యూస్ తెలుసుకున్న ఇద్దరు స్టార్స్ ఫ్యాన్స్ ఫుల్ ఖుషీ అవుతున్నారు. నాటు నాటును మించేలా ఈ సాంగ్ ఉండాలని, ఆ సాంగ్ కి థియేటర్స్ దద్దరిల్లి పోవాలని కామెంట్స్ చేస్తున్నారు.