KAANTHA: చూపులతోనే చంపేస్తున్న కుమారి..1950 మద్రాస్ బ్యాక్‌‌‌‌డ్రాప్‌‌‌‌లో దుల్కర్ ‘కాంత’

KAANTHA: చూపులతోనే చంపేస్తున్న కుమారి..1950 మద్రాస్ బ్యాక్‌‌‌‌డ్రాప్‌‌‌‌లో దుల్కర్ ‘కాంత’

గతేడాది ‘మిస్టర్ బచ్చన్’చిత్రంతో టాలీవుడ్ ఎంట్రీ ఇచ్చిన భాగ్యశ్రీ బోర్సే.. ఒక్క సినిమాతోనే  మోస్ట్  హ్యాపెనింగ్ హీరోయిన్‌‌‌‌గా పేరు తెచ్చుకుంది. తనదైన గ్లామర్‌‌‌‌‌‌‌‌తో ఆకట్టుకున్న ఆమె ప్రస్తుతం వరుస సినిమాల్లో నటిస్తోంది. మంగళవారం (మే 6) భాగ్యశ్రీ బోర్సే పుట్టినరోజు. ఈ సందర్భంగా తను నటిస్తున్న చిత్రాల నుంచి క్రేజీ అప్‌‌‌‌డేట్స్‌‌‌‌ను అందించారు మేకర్స్. 

మలయాళ స్టార్ హీరో దుల్కర్ సల్మాన్‌‌‌‌కు జంటగా భాగ్యశ్రీ నటిస్తున్న చిత్రం ‘కాంత’.సెల్వమణి సెల్వరాజ్ రూపొందిస్తున్న ఈ చిత్రం నుంచి ఆమె క్యారెక్టర్‌‌‌‌‌‌‌‌ను రివీల్ చేస్తూ స్పెషల్ పోస్టర్‌‌‌‌‌‌‌‌ను రిలీజ్ చేశారు. ఇందులో ఆమె కుమారి పాత్రలో కనిపించనుందని రివీల్ చేస్తూ.. రిలీజ్ చేసిన  పోస్టర్‌‌‌‌‌‌‌‌లో కారులో కూర్చొని క్లాసిక్ లుక్‌‌‌‌లో భాగ్యశ్రీ  ఆకట్టుకుంటోంది.

1950 మద్రాస్ బ్యాక్‌‌‌‌డ్రాప్‌‌‌‌లో రూపొందుతున్న ఈ చిత్రాన్ని రానా దగ్గుబాటి, దుల్కర్ సల్మాన్, ప్రశాంత్ పొట్లూరి, జోమ్ వర్గీస్ కలిసి నిర్మిస్తున్నారు. ఇప్పటికే షూటింగ్ పూర్తయింది. ప్రస్తుతం పోస్ట్ ప్రొడక్షన్ వర్క్స్ జరుగుతున్నాయి. సముద్రఖని కీలకపాత్ర పోషిస్తున్నాడు. జాను సంగీతం అందిస్తున్నాడు. త్వరలోనే సినిమా రిలీజ్ డేట్‌‌‌‌ను అనౌన్స్ చేయనున్నారు.

Also Read : కాంతార 2ని వెంటాడుతున్న ప్రమాదాలు

మరోవైపు భాగ్యశ్రీ ప్రస్తుతం విజయ్ దేవరకొండకు జంటగా ‘కింగ్‌‌‌‌డమ్’,రామ్‌‌‌‌కు జోడీగా ఓ మూవీలో నటిస్తోంది. ఈ మూవీ టీమ్స్ కూడా ఆమెకు బర్త్‌‌‌‌డే విషెస్‌‌‌‌ను తెలియజేశారు.