Kantara 2: కాంతార 2ని వెంటాడుతున్న ప్రమాదాలు.. షూటింగ్‌లో జూనియర్ ఆర్టిస్ట్ దుర్మరణం

Kantara 2: కాంతార 2ని వెంటాడుతున్న ప్రమాదాలు.. షూటింగ్‌లో జూనియర్ ఆర్టిస్ట్ దుర్మరణం

కన్నడ సినీ పరిశ్రమలో విషాదం చోటుచేసుకుంది. కన్నడ స్టార్ హీరో రిషబ్ శెట్టి స్వీయ దర్శకత్వంలో నటిస్తోన్న కాంతారా 2 మూవీ షూటింగ్లో ప్రమాదం జరిగింది. సెట్‌లో ఉన్న మళయాళీ జూనియర్ ఆర్టిస్ట్ కపిల్ (33) ప్రమాదవశాత్తు నదిలో మునిగి ప్రాణాలు కోల్పోయాడు.

ఈ సంఘటన ఉడిపి జిల్లా బైందూర్లోని కొల్లూరులో జరిగింది. అయితే, ఆర్టిస్ట్ కపిల్.. షూట్ కంప్లీట్ అయిన తర్వాత తన టీమ్తో కలిసి కొల్లూరులోని సౌపర్ణిక నదిలో ఈతకు వెళ్లాడు. అక్కడ నీటి లోతు తెలియకనే నదిలో మునిగి చనిపోయాడని ప్రాధమిక సమాచారం. కొల్లూరు పోలీస్ స్టేష‌న్ పరిధిలో జ‌రిగిన ఈ ఘ‌ట‌న‌పై పోలీసులు కేసు న‌మోదు చేసి ద‌ర్యాప్తు చేస్తున్నారు. ప్రస్తుతం ఈ వార్త కాంతారా చిత్రబృందానికి షాక్ ఇచ్చింది.

ఇప్పటికే, కాంతారా 2 షూటింగ్ మొదలైనప్పటి నుంచి పలు వరుస ప్రమాదాలు సంభవిస్తూనే ఉన్నాయి. కొన్ని రోజుల క్రితం కొల్లూరులోనే జూనియర్ ఆర్టిస్టులతో వెళ్తున్న బస్సు సడెన్ గా బోల్తా పడింది. ఈ ప్రమాదంలో ప్రాణ నష్టం జరగకపోయినప్పటికీ.. అందులో కొందరికీ తీవ్ర గాయాలయ్యాయి.

అంతేకాకుండా ఓ సారి గాలి వాన రావడం వల్ల నిర్మించిన భారీ సెట్ కూలిపోయింది. అప్పుడు ఎలాంటి ప్రాణనష్టం జరగలేదు.ఇప్పుడీ ఈ తాజా ప్రమాదంతో కాంతారా 2 అయోమయంలో పడింది. అసలేం జరుగుతోంది. ఇలా యనెడుకు జరుగుంతుందని నెటిజన్లు పోస్టులు పెడుతున్నారు.