
వెలుగు, హైదరాబాద్‌సిటీ: సినీ హీరోయిన్ హెబ్బా పటేల్ శుక్రవారం కొండాపూర్‌లోని శరత్ సిటీ మాల్లో సందడి చేసింది. వింధ్యా గోల్డ్వారు ఏర్పాటు చేసిన గోల్డ్, సిల్వర్బార్ చాలెంజ్‌ను ముఖ్య అతిథిగా ప్రారంభించింది. లాక్‌చేసిన బాక్స్ నుంచి గోల్డ్, సిల్వర్ బార్‌ను తీస్తూ ఫొటోలకు పోజులిచ్చింది. ఈ నెల 25 వరకు ఈ చాలెంజ్ఉంటుందని నిర్వాహకులు తెలిపారు.