నన్ను బాడీ షేమింగ్ చేశారు.. అయినా కూడా!

నన్ను బాడీ షేమింగ్ చేశారు.. అయినా కూడా!

బలగం(Balagam) సినిమాతో టాలీవుడ్ లో నటిగా మంచి గుర్తింపు తెచ్చుకుంది పిల్లికల్ల బ్యూటీ కావ్య కళ్యాణ్ రామ్(Kavya kalyanram). అయితే కెరీర్ స్టార్టింగ్ లో ఈ అమ్మడు బాడీ షేమింగ్ కు గురైందట. తాజాగా ఆమె హీరోయిన్ గా నటిస్తున్న లేటెస్ట్ మూవీ ఉస్తాద్(Ustaad). ఈ సినిమాలో ప్రముఖ సంగీత దర్శకుడు కీరవాణి(Keeravani) కుమారుడు శ్రీసింహా(Sri simha) హీరోగా నటిస్తున్నారు. ఆగస్టు 12న ఈ సినిమా ప్రేక్షకుల ముందుకు రానుంది ఈ సినిమా. 

తాజాగా ఉస్తాద్ మూవీ ప్రేమోషన్స్ లో పాల్గొన్న కావ్య.. సినిమా గురించి, తన పర్సనల్ లైఫ్ గురించి చాలా విషయాలు చెప్పుకొచ్చింది. ఇందులో భాగంగా తన సినీ కెరీర్ గురించి మాట్లాడింది కావ్య. "కెరీర్ మొదట్లో ఒక సినిమా ఆడిషన్ కి వెళ్లాను. ఆ సినిమా దర్శకనిర్మాతలు నన్ను బాడీ షేమింగ్ చేశారు. మీరు కాస్త లావుగా ఉన్నారు. ఇలా ఉంటే మీకు ఛాన్సులు రావు, సన్నగా అవ్వాలని చెప్పారు. కానీ నేను ఆ మాటలు పట్టించుకోలేదు. పట్టుదలతో ప్రయత్నించాను, ప్రస్తుతం వరుస సినిమాలు చేస్తున్నాను" అని చెప్పుకొచ్చింది కావ్య. ప్రస్తతం కావ్య చేసిన ఈ కామెంట్స్ వైరల్ అవుతున్నాయి.

ALSOREAD :బోట్లతో బ్రో మూవీ ప్రమోషన్స్.. ఇది నెక్స్ట్ లెవల్ భయ్యో!

ఇక చైల్డ్ ఆర్టిస్టుగా తెలుగులో చాలా సినిమాలు చేసిన కావ్య కళ్యాణ్ రామ్.. మసూద(Masooda)  సినిమాతో టాలీవడ్ లో హీరోయిన్ గా ఎంట్రీ ఇచ్చింది. ఆ తరువాత కావ్య హీరోయిన్ గా చేసిన బలగం మూవీ బ్లాక్ బస్టర్ హిట్ గా నిలిచింది. ఇక ఇప్పుడు శ్రీసింహా తో ఉస్తాద్ సినిమా చేస్తోంది. ఈ సినిమా కూడా హిట్ అయితే.. కెరీర్ సార్టింగ్ లోనే హ్యాట్రిక్ హిట్స్ సాధించిన హీరోయిన్ గా రికార్డ్ క్రియేట్ చేస్తుంది కావ్య కళ్యాణ్ రామ్.