బోట్లతో బ్రో మూవీ ప్రమోషన్స్.. ఇది నెక్స్ట్ లెవల్ భయ్యో!

బోట్లతో బ్రో మూవీ ప్రమోషన్స్.. ఇది నెక్స్ట్ లెవల్ భయ్యో!

పవర్ స్టార్ పవన్ కళ్యాణ్(Pawan kalyan) మరోసారి దేవుడిగా కనిపిస్తున్న చిత్రం బ్రో(Bro). మరో మెగా హీరో సాయి ధరమ్ తేజ్(Sai dharam tej) కీ రోల్ లో కనిపించనున్నారు. తమిళ దర్శకుడు సముధ్రఖని(Samutirakhani) దర్శకత్వం వహిస్తున్న ఈ సినిమా జులై 28న ప్రేక్షకుల ముందుకు రానుంది. చాలా గ్యాప్ తరువాత పవన్ కళ్యాణ్ నుండి వస్తున్న సినిమా కావడం, అందులోనూ ఇద్దరు మెగా హీరోలు కలిసి నటిస్తుండటంతో ఈ సినిమాపై అభిమానుల్లో భారీ అంచనాలున్నాయి. 

ALSOREAD :దళపతి విజయ్,శంకర్ కాంబినేషన్ లో పొలిటికల్ థ్రిల్లర్?

అందుకు తగ్గట్టుగానే బ్రో సినిమా నుండి రిలీజైన పోస్టర్స్ అండ్ టీజర్ కు సూపర్ రెస్పాన్స్ వచ్చింది. ఇక తాజాగా వినూత్న రీతిలో బ్రో మూవీ ప్రమోషన్స్ మొదలుపెట్టారు మేకర్స్. గోదావరి నది మధ్యలో బోట్లతో బ్రో టైటిల్‌ను క్రియేట్ చేశారు. దీనికి సంబందించిన వీడియోను మేకర్స్ సోషల్ మీడియాలో షేర్ చేశారు. ఈ వీడియో ప్రస్తుతం నెట్టింట తెగ వైరల్ అవుతోంది. వినూత్న పద్దతిలో ప్రమోషన్స్ మెదలుపెట్టిన బ్రో మూవీ టీమ్.. ప్రేక్షకుల్లో సినిమాఫై ఇంట్రెస్ట్ ను క్రియేట్ చేస్తోంది. 

ఇక జులై 28న ప్రేక్షకుల ముందుకు రానున్న ఈ సినిమాకు.. తమన్(Thaman) సంగీతం అందిస్తున్నారు. కేతిక శర్మ(Kethika sharma), ప్రియా ప్రకాష్ వారియర్(Priya praksh varoir) హీరోయిన్స్ గా నటిస్తున్న ఈ సినిమాను.. పీపుల్స్ మీడియా ఫ్యాక్టరీ(Peoples media factory) నిర్మిస్తుండగా.. స్టార్ డైరెక్టర్ త్రివిక్రమ్(Trivikram) స్క్రీన్ ప్లే, డైలాగ్స్ అందిస్తున్నారు. తమిళ సినిమా వినోదయ సీతమ్(Vinodaya seetham) కు రీమేక్ గా వస్తున్న బ్రో మూవీ.. తెలుగులో ఎలాంటి రిజల్ట్ అందుకుంటుందో చూడాలి. 

Brace yourselves for the #BroTheAvatar Mania as we GEAR UP to storm your timelines ?

Here's BRO boats charging into the Waters of Godavari ⛵?

More updates your way.@PawanKalyan @IamSaiDharamTej @UrvashiRautela @TheKetikaSharma @thondankani @MusicThaman @vishwaprasadtgpic.twitter.com/Ru5od0kajd

— People Media Factory (@peoplemediafcy) July 11, 2023