దళపతి విజయ్,శంకర్ కాంబినేషన్ లో పొలిటికల్ థ్రిల్లర్?

 దళపతి విజయ్,శంకర్ కాంబినేషన్ లో పొలిటికల్ థ్రిల్లర్?

హీరో విజయ్ దళపతి(Thalapathy Vijay), తమిళ డైరెక్టర్ శంకర్(Shankar)  కాంబినేషన్ లో వచ్చిన స్నేహితుడు మూవీ బాక్సాపీస్ వద్ద మంచి విజయాన్ని అందుకుంది. తాజా సమాచారం ప్రకారం ఈ కాంబో నుంచి మరో మూవీ రానుందని తెలుస్తోంది. ఈ మూవీ పవర్ ఫుల్ పొలిటికల్ థ్రిల్లర్ జోనర్ లో రాబోతున్నట్లు టాక్ వినిపిస్తోంది. డైరెక్టర్ ఇప్పటికే స్టోరీ లైన్ ని విజయ్ కు వినిపించాడని..స్టోరీ నచ్చడంతో సినిమా పట్టాలెక్కనున్నట్లు టాక్.  

శంకర్ ఇండియన్ 2, గేమ్ ఛేంజర్ మూవీస్ వచ్చే ఏడాది ప్రారంభంలో విడుదలైన తర్వాత, 2024 ఏడాది స్టార్టింగ్ లో విజయ్ స్క్రిప్ట్‌ను ప్రారంభించనున్నారు. ఈ ప్రాజెక్ట్ దళపతి 70వ మూవీ కానుందని తెలుస్తోంది. విజయ్ ప్రస్తుతం చేస్తున్న లియో మూవీ షూటింగ్‌ చివరి దశలో ఉండగా..శంకర్ ఏకకాలంలో ఇండియన్ 2 తో పాటు రామ్ చరణ్ గేమ్ ఛేంజర్‌ మూవీ షూటింగ్స్ తో బిజీగా ఉన్నారు. 

ALSOREAD :దేవుళ్లకు పాలాభిషేకాలు ఎందుకు : స్టార్ హీరో కామెంట్లు

విజయ్ సినిమాలతో పాటుగా రాజకీయాల్లో కూడా క్రియాశీలకంగా ఉన్నట్లు తెలుస్తోంది. ప్రస్తుతం పాదయాత్ర స్టార్ట్ చేసి ప్రజల్లోకి వెళుతారని తమిళ నోటా వినిపిస్తోంది. ఇక విజయ్..శంకర్ నుంచి రాబోయే మూవీ కూడా పొలిటికల్ థ్రిల్లర్ అవ్వడంతో ఎటువంటి ప్రకంపనాలు క్రియేట్ చేస్తుందో అంటూ ఫ్యాన్స్ ఎదురు చూస్తున్నారు. ఈ ప్రాజెక్ట్‌కి సంబంధించిన అధికారిక ప్రకటన త్వరలో రానుందని సమాచారం.