దేవుళ్లకు పాలాభిషేకాలు ఎందుకు : స్టార్ హీరో కామెంట్లు

దేవుళ్లకు పాలాభిషేకాలు ఎందుకు : స్టార్ హీరో కామెంట్లు

బాలీవుడ్ స్టార్ హీరో అక్షయ్ కుమార్(Akshay kumar) దేవుడిగా చేస్తున్న సినిమా ఓ మై గాడ్ 2(OMG2). 2012లో వచ్చిన ఓ మై గాడ్ సినిమాకు ఇది సీక్వెల్. మరో ముఖ్య పాత్రలో పంకజ్ త్రిపాఠి(Pankaj tripathi) నటిస్తున్న ఈ సినిమా.. ఆగస్టు 11న ప్రేక్షకుల ముందుకు రానుంది. రిలీజ్ డేట్ దగ్గర పడుతుండటంతో ప్రమోషన్స్ పనులు మొదలు పెట్టేశారు మేకర్స్. ఇందులో భాగంగా OMG2 నుండి టీజర్ రిలీజ్ చేశారు మేకర్స్.

ఈ టీజర్ కు ఆడియన్స్ నుండి అదిరిపోయే రెస్పాన్స్ వస్తోంది. పరమశివుడి పాత్రలో అక్షయ్ కుమార్ నెక్స్ట్ లెవల్ పర్ఫార్మెన్స్ ఇచ్చాడు. దీంతో OMG2 పై అంచనాలు భారీ పెరిగిపోయాయి. అయితే ఆడియన్స్ ఓపక్క ఈ టీజర్ పై ప్రశంసలు కురిపిస్తూనే.. మరోపక్క అక్షయ్ కుమార్ పై కామెంట్స్ చేస్తున్నారు. దానికి కారణం గతంలో అక్షయ్ దేవతలకు అభిషేకాలు చేయడంపై వావాదాస్పద కామెంట్స్ చేయడమే. 

ALSOREAD :బ్రో మూవీకు త్రివిక్రమ్ భారీ రెమ్యూనరేషన్.. ఎంతో తెలుసా? 

ఇక తాజాగా బాలీవుడ్ వివాదాస్పద క్రిటిక్ కేఆర్కే(KRK)  ఈ టీజర్ పై స్పందించారు. అంతేకాదు.. అక్షయ్ గతంలో దేవుళ్లపై చేసిన కామెంట్స్ కు సంబందించిన వీడియోను కూడా షేర్ చేశారు. ఈ వీడియోలో అక్షయ్ మాట్లాడుతూ.. దేవుడికి అభిషేకాల పేరుతో పాలు, నూనె ఎందుకు వృధా చేస్తారో నాకు అర్థం కాదు. నాపై పాలు పోయండి, నూనె పోయండి అని దేవుడు చెప్పాడా? ఓపక్క ఆహరం లేక చాలా మంది చనిపోతున్నారు. వాళ్లకి ఇవ్వొచ్చు కదా. ఇలాంటివి నేను దేవాలయాలకు వెళ్ళినప్పుడు చుశాను" అని వీడియోలో చెప్పుకొచ్చారు అక్షయ్. 

అయితే దేవుడికి అభిషేకాలు చేయడం వృధా అని కామెంట్స్ చేసిన అక్షయ్.. సినిమాలో అభిషేకం చేయించుకుంటూ ఎలా కనిపించారంటూ కామెంట్స్ చేస్తున్నారు. ప్రస్తుతం అక్షయ్ చేసిన ఈ కామెంట్స్ కు సంబందించిన వీడియో నెట్టింట వైరల్ అవుతున్నాయి. మరి ఈ ప్రభావం సినిమాపై నెగిటీవ్ ఇంపాక్ట్ చూపిస్తుందా అనేది చూడాలి.