
డైరెక్టర్ త్రివిక్రమ్(Trivikram) పెన్నుపవర్ ఏంటో అందరికీ తెలిసేందే. తన మాటలతో ప్రతి ఒక్కరినీ ఆలోచింపజేస్తారు.ఎంత పెద్ద యుద్ధమైన ఒక్క చిన్న మాటతో శాంతిపరుస్తారు. అటువంటి పెన్ను పవర్ రెమ్యునరేషన్ ఇప్పుడు ఆకాశంలో ఉందని టాక్ వినిపిస్తోంది. పవన్ కళ్యాణ్(Pawan Kalyan) ఇక లేటెస్ట్ గా తమిళంలో సూపర్ హిట్టైన వినోదయ సీతం మూవీను తెలుగులో బ్రో(BRO) గా రీమేక్ చేస్తున్నారు.
ఈ మూవీకు డైరెక్టర్ గా మాతృక దర్శకుడు సముద్రఖనికి ఛాన్స్ ఇచ్చినా త్రివిక్రమ్ హ్యాండ్ బాగా ఉందని తెలుస్తోంది. ఈ మూవీ కు స్క్రీన్ ప్లే, మాటలు త్రివిక్రమ్ కావడం విశేషం. దీనికి అయన రూ.15 కోట్ల వరకు భారీ రెమ్యూనరేషన్ తీసుకున్నట్లు వినిపిస్తోంది. కథ ఎలా ఉన్నా కథనం నడిపించడంలో, మాటలుతో మూవీ నడిపించడంలో త్రివిక్రమ్ దిట్ట. ఇక బ్రో మూవీకు ఇంత భారీ మొత్తాన్ని పీపుల్ మీడియా ఫ్యాక్టరీ వాళ్ళు ఇవ్వడంతో త్రివిక్రమ్ హ్యాపీ అయ్యాడనే ఇండస్ట్రీ వర్గాలు తెలుపుతున్నాయి.
ALSOREAD :ప్రైవేట్ జెట్ ఎమర్జెన్సీ ల్యాండింగ్.. కొద్దిలో తప్పిన ఘోర ప్రమాదం
టీజీ విశ్వప్రసాద్ పీపుల్ మీడియా ఫ్యాక్టరీ బ్యానర్‌పై ఈ మూవీను నిర్మిస్తున్నారు. సాయిధరమ్ తేజ్ సరసన ఈ చిత్రంలో కేతిక శర్మ హీరోయిన్ పాత్ర పోషిస్తోంది. ప్రియా ప్రకాశ్ వారియర్ కూడా ఓ కీలక పాత్ర చేస్తోంది. బ్రహ్మానందం, సుబ్బరాజు, తనికెళ్ల భరిణి కీలక పాత్రల్లో కనిపించనున్నారు.
ప్రపంచవ్యాప్తంగా జూలై 28న థియేటర్లలో ఈ మూవీ విడుదల కానుంది. ఈ తరుణంలో ప్రమోషన్‍లలో దూకుడు పెంచేందుకు బ్రో చిత్ర యూనిట్ రెడీ అయింది.