ప్రైవేట్ జెట్ ఎమర్జెన్సీ ల్యాండింగ్.. కొద్దిలో తప్పిన ఘోర ప్రమాదం

ప్రైవేట్ జెట్ ఎమర్జెన్సీ ల్యాండింగ్.. కొద్దిలో తప్పిన ఘోర ప్రమాదం

బెంగళూరులోని హిందుస్థాన్ ఏరోనాటిక్స్ లిమిటెడ్ (హెచ్‌ఏఎల్) ఎయిర్‌పోర్ట్‌లో ఒక ప్రైవేట్ విమానం సాంకేతిక లోపంతో అత్యవసర ల్యాండింగ్ అయింది. ఈ ల్యాండింగ్ తో విమాన ప్రమాదం తప్పింది.ఫ్లై బై వైర్ ప్రీమియర్ 1A విమానం VT-KBN, HAL నుంచి కెంపెగౌడ అంతర్జాతీయ విమానాశ్రయానికి వెళుతుండగా ఈ ఘటన చోటుచేసుకున్నట్టు డైరెక్టరేట్ జనరల్ ఆఫ్ సివిల్ ఏవియేషన్ (DGCA) తెలిపింది. టేకాఫ్ తర్వాత  ల్యాండింగ్ గేర్‌లో సాంకేతిక సమస్య ఏర్పడిందని తెలిపింది.

ALSOREAD :బీఆర్ఎస్ది తప్పుడు ప్రచారం.. కాంగ్రెస్ ఎప్పుడూ రైతుల పక్షమే: థాక్రే

పైలట్ ఎయిర్‌టర్ ను ల్యాండ్ చేయాలని నిర్ణయించుకోవడంతో.. పరిస్థితిని హెచ్‌ఏఎల్ ఎయిర్‌పోర్ట్ ఎయిర్ ట్రాఫిక్ కంట్రోల్‌కి తెలియజేశారు. ఆ తర్వాత అప్ పొజిషన్‌లోని గేర్‌తో విమానం సురక్షితంగా ల్యాండ్ అయింది. విమానం ఈ సాంకేతిక సమస్యను ఎదుర్కొన్న సమయంలో, ఎయిర్ వెహికల్‌లో కేవలం ఇద్దరు పైలట్లు మాత్రమే ఉన్నారు. ప్రయాణికులు ఎవరూ లేరని, ఇద్దరు పైలట్లలో ఎవరికీ గాయాలు కాలేదని డీజీసీఏ తెలిపింది.

Bengaluru | A Fly By wire Premier 1A aircraft VT-KBN operating flight on sector 'HAL Airport Bangalore to BIAL' was involved in Airturnback as the nose landing gear couldn't be retracted after take off. The aircraft safely landed with the nose gear in Up position. There were two… pic.twitter.com/53zmaaKKEn

— ANI (@ANI) July 11, 2023