బీఆర్ఎస్ది తప్పుడు ప్రచారం.. కాంగ్రెస్ ఎప్పుడూ రైతుల పక్షమే: థాక్రే

బీఆర్ఎస్ది తప్పుడు ప్రచారం.. కాంగ్రెస్ ఎప్పుడూ  రైతుల పక్షమే: థాక్రే

ఉచిత కరెంట్ పై రేవంత్ వ్యాఖ్యలను వక్రీకరించారన్నారు కాంగ్రెస్ తెలంగాణ ఇన్ ఛార్జ్ మాణిక్ రావు థాక్రే.  అమెరికాలో రేవంత్ చేసిన వ్యాఖ్యలపై బీఆర్ఎస్ తప్పుడు ప్రచారం చేస్తుందని మండిపడ్డారు.   కాంగ్రెస్ ఎప్పుడూ రైతుల పక్షమేనన్నారు.  రైతులకు మేలు చేసింది కాంగ్రెస్సేనని చెప్పారు. 

ALSOREAD :గూగుల్ డూడుల్​లో పానీ పూరి గేమ్స్.. నోరూరిస్తున్నాయిగా

 బీఆర్ఎస్ అవినీతిలో కూరుకుపోయిందన్నారు థాక్రే.  ఉచిత విద్యుత్, రుణమాఫీ, మద్దతు ధరపై కాంగ్రెస్ రైతుల పక్షమేనన్నారు. రా హుల్ రిలీజ్ చేసిన రైతు డిక్లరేషన్ కు కట్టుబడి ఉన్నామని తెలిపారు.  తెలంగాణ ప్రజలను రైతులను బీఆర్ఎస్ మోసం చేస్తుందన్నారు. తన కుటుంబ ప్రయోజనాల కోసమే కేసీఆర్ ప్రయత్నిస్తున్నారని చెప్పారు.  బీఆర్ఎస్- బీజేపీ ఒక్కటేనని విమర్శించారు. తెలంగాణలో కాంగ్రెస్ గ్రాఫ్ పెరుగుతోందన్న థాక్రే.. ప్రజల కోసం కేసీఆర్ ప్రభుత్వం పనిచేయడం లేదన్నారు.

10 సంవత్సరాల బీఆర్ఎస్ పాలనలో కేసీఆర్ కుటుంబ అభివృద్ది జరిగింది తప్ప.. ప్రజలకు మేలు జరగలేదన్నారు థాక్రే. కేసీఆర్ అంధికారం లోకి రాక ముందు ఎన్నో హామీలు ఇచ్చారు కానీ అమలు చేయడం లేదన్నారు. రైతులను తప్పుడు స్టేట్మెంట్ తో ప్రతి సారి మోసం చెయ్యడమే బీఆర్ఎస్ కు తెలుసన్నారు.