గూగుల్ డూడుల్​లో పానీ పూరి గేమ్స్.. నోరూరిస్తున్నాయిగా

గూగుల్ డూడుల్​లో పానీ పూరి గేమ్స్.. నోరూరిస్తున్నాయిగా

పానీ పూరి.. ఈ పేరు తెలియని వారు ఉండరు అనడంలో అతిశయోక్తి లేదు. భారతీయ స్ట్రీట్​ఫుడ్​లో దీని స్థానమే ప్రత్యేకం. పానీ పూరి వార్షికోత్సవం సందర్భంగా గూగుల్ డూడుల్... ​పానీ పూరి గేమ్​తో స్ట్రీట్ ఫుడ్​ విశిష్టతను ప్రపంచానికి తెలియజేసింది. 

గేమ్‌లో ఆటగాడు ప్లేట్‌ను పట్టుకున్న చేతిని నియంత్రిస్తాడు. పూరీలను గాలిలోకి షూట్ చేయడానికి, నోటితో వాటిని పట్టుకోవడానికి ప్లేట్‌పై క్లిక్ చేయాలి. ఎంత ఎక్కువ పూరీలు నోటికి చిక్కితే అంత ఎక్కువ స్కోర్‌ పొందవచ్చు. 

దీంట్లో సౌండ్​ఎఫెక్ట్​లు కూడా ఉండటంతో  ఆకట్టుకుంటోంది. దీనికి తోడు క్యాండీ క్రష్ లాంటి మరో గేమ్​ని కూడా డూడుల్​ క్రియేట్ చేసింది. మరి గూగుల్​ డూడుల్​లో ఇవి మీరు గమనించారా. ఇప్పుడే వెళ్లి ఆ గేమ్స్​ఆడేయండి మరి. ఇండియాకు పానీ పూరిపై ఉన్న ప్రేమకు గుర్తుగా గూగుల్​ ఇలా క్రియేట్​ చేసింది. చాలా మందికి ఉపాధి  ఇస్తోన్న ఈ పానీ పూరి.. ఎంతో మంది రోజూవారి జీవితంలో భాగం అయిపోయింది.

ALSOREAD :చంద్రయాన్ కౌంట్ డౌన్.. ఈ ప్రయోగం విశిష్టత, విశేషాలు ఇవే..

మహాభారతంలో ఆనవాళ్లు..

2015లో, మధ్యప్రదేశ్‌  ఇండోర్‌లోని ఒక రెస్టారెంట్ జులై 12న 51 రకాల నోరూరించే పానీ పూరీలు తయారు  చేసి  ప్రపంచ రికార్డు సృష్టించింది.  అప్పటి నుంచి ఏటా జులై 12న ఇండియాలో పానీ పూరి డే సెలెబ్రేట్​ చేసుకుంటున్నారు. అలాంటి ఈ ఐకానిక్ స్ట్రీట్ ఫుడ్‌ను గోల్​గప్ప తదితర పేర్లతో పిలుస్తారు. 

దీనిని మొదటగా మహాభారత కాలంలో కనుగొన్నట్లు పురాణాలు చెబుతున్నాయి. బంగాళదుంపలు, ఉల్లిపాయలు, దానికి వాడే నీరు.. మొదలైన పదార్థాలతో డెడ్లీ కాంబోగా ఇది నోరూరిస్తూ ఉంటుంది.