ది వారియర్పై కృతిశెట్టి కబుర్లు

ది వారియర్పై కృతిశెట్టి కబుర్లు

మొదటి సినిమాతోనే మంచి మార్కులు వేయించుకుని, వరుస అవకాశాలతో దూసుకుపోతోంది కృతీశెట్టి. రీసెంట్‌‌‌‌గా రామ్‌‌‌‌తో కలిసి ‘ద వారియర్‌‌‌‌‌‌‌‌’లో నటించింది. లింగుస్వామి డైరెక్షన్‌‌‌‌లో శ్రీనివాస చిట్టూరి నిర్మించిన ఈ బైలింగ్వల్ మూవీ జులై 14న విడుదలవుతున్న సందర్భంగా కృతి కాసేపు ఇలా కబుర్లు చెప్పింది.

‘‘లింగుస్వామి తీసిన 'ఆవారా'ను తమిళంలో చూశాను. చాలా నచ్చేసింది. అమ్మమ్మ  ఇంటికి వెళ్ళినప్పుడు ఆ సినిమా సీడీ తీసుకువెళ్లేదాన్ని. రోజుకి రెండు మూడుసార్లు చూసిన సందర్భాలు కూడా ఉన్నాయి.అందుకే లింగుస్వామి నాకోసం ఫోన్ చేశారని అమ్మ చెప్పినప్పుడు చాలా ఎక్సయిటయ్యాను. ఆయన సినిమాలు ఎంట‌‌‌‌ర్‌‌‌‌టైనింగ్‌‌‌‌గా ఉంటాయి. కథలు కొత్తగా ఉంటాయి. హీరోయిన్లకి పెర్ఫార్మ్ చేసే స్కోప్ దొరుకుతుంది. కథ విన్న తర్వాత ఎక్సయిట్‌‌‌‌మెంట్ ఇంకా పెరిగింది. అయితే షూటింగ్ స్టార్ట్ చేయడానికి ముందు కొంచెం నెర్వస్ ఫీలయ్యాను. రామ్ ఎనర్జీని మ్యాచ్ చేయాలంటే కష్టం కదా. కానీ షూటింగ్ మొదలైన తర్వాత చాలా ఎంజాయ్ చేశా. ఎక్స్‌‌‌‌ట్రా ఎనర్జీ కావాలనుకున్నప్పుడు ఈ మూవీలోని ‘విజిల్’ సాంగ్ పెట్టుకుని డ్యాన్స్ చేస్తాను. ఇందులో నా పాత్రని అందరూ ప్రేమిస్తారు. తమ ఇంట్లో అమ్మాయిలా ఫీలవుతారు. నేను ఆర్జే. రామ్ పోలీస్. మా ఇద్దరి మధ్య వచ్చే సీన్స్ చాలా బాగుంటాయి. ఆర్జే కనిపించకపోయినా, ఎక్స్‌‌‌‌ప్రెష‌‌‌‌న్‌‌‌‌ ఫీలవ్వాలి. అందుకే చాలా వీడియోస్ చూసి ప్రాక్టీస్ చేశా. ఆర్టిస్ట్ నుంచి ఏం రాబట్టుకోవాలో డైరెక్టర్‌‌‌‌‌‌‌‌కి స్పష్టంగా తెలుసు. ఎలా నటించాలో చేసి మరీ చూపిస్తారు. వాయిస్ మాడ్యులేషన్ కూడా చేశారు. విలన్‌‌‌‌గా చేసిన ఆది పినిశెట్టితో నాకు కాంబినేషన్ సీన్స్ లేవు. ఆయన బయట చాలా సాఫ్ట్. అందుకు పూర్తి డిఫరెంట్‌‌‌‌గా ఉంటారు ఈ మూవీలో. బైలింగ్వల్‌‌‌‌ మూవీ కనుక తమిళులకి కూడా మూవీ బాగా నచ్చుతుందని అనుకుంటున్నా. నేను మరో తమిళ సినిమా చేస్తున్నాను. సూర్య హీరో. నాగచైతన్యతో వెంకట్ ప్రభు డైరెక్షన్‌‌‌‌లో చేస్తున్న సినిమా కూడా బైలింగ్వలే. అందుకే తమిళం నేర్చుకుంటున్నాను.  నెక్స్ట్ ‘మాచర్ల నియోజకవర్గం’ మూవీతో ప్రేక్షకుల ముందుకొస్తాను. మంచి యాక్షన్ రోల్ చేయాలనుంది. అయితే ఇప్పుడే కాదు.. ఫ్యూచర్‌‌‌‌‌‌‌‌లో’’