
అవకాశాలు ఉన్నప్పుడే నాలుగు రాళ్లు వెనకేసుకోవాలి. సినిమా ఇండస్ట్రీలో చాలా మంది ఇదే ఫార్ములాను ఫాలో అవుతుంటారు. రెమ్యునరేషన్ కాస్త గట్టిగా ఉందంటే చాలు గుడ్డిగా సంతకాలు చేసేస్తారు. అయితే ఈ ఫార్ములాకు తాను విరుద్ధం అంటుంది మళయాళ భామ మాళవిక మోహనన్(Malavika mohanan). అది రూ.500 కోట్ల సినిమా అయినా సరే తన పాత్రకు ప్రాధాన్యత లేకపోతె ఆ సినిమా చేసే ఛాన్సే లేదంటుంది ఈ బ్యూటీ.
ఇటీవల ఓ ఇంటర్వ్యూలో పాల్గొన్న మాళవిక తన సినీ కెరీర్ పై ఇంట్రెస్టింగ్ కామెంట్స్ చేసింది. మాస్టర్(Master) సినిమా సక్సెస్ తరువాత నాకు చాలా ఆఫర్స్ వచ్చాయి. కానీ నేను సెలెక్ట్ గానే సినిమాలు చేస్తున్నారు. ఎందుకంటే? సినిమాలో నా పాత్రకు ప్రాధాన్యత లేకపోతే నేను ఆ సినిమా ఒప్పుకొను. అది రూ.500 కోట్లు వసూలు చేసే సినిమా అయినా సరే. ఆ సినిమా సూపర్ హిట్ అయినా, నా పాత్రకు గుర్తింపు ఉండదు కదా అంటూ ఇంట్రెస్టింగ్ కామెంట్స్ చేసింది మాళవిక. ప్రస్తుతం మాళవిక చేసిన ఈ కామెంట్స్ సోషల్ మీడియాలో వైరల్ గా మారుతున్నాయి.
ఇక మాళవిక మోహనన్ చేస్తున్న సినిమాల విషయానికి వస్తే.. ప్రస్తుతం ఆమె పాన్ ఇండియా స్టార్ ప్రభాస్(Prabhas) హీరోగా మారుతి(Maruthi) దర్శకత్వంలో వస్తున్న సినిమాలో హీరోయిన్ గా నటిస్తోంది. ప్రస్తుతం షెరవేగంగా షూటింగ్ జరుపుకుంటున్న ఈ సినిమాకు ఇంకా టైటిల్ అనూన్స్ చేయలేదు మేకర్స్. ఈ సినిమా 2024లో ప్రేక్షకుల ముందుకు రానుంది. ఇక ఈ సినిమాలో మాళవిక మోహనన్ తోపాటు మరో ఇద్దరు హీరోయిన్ కూడా నటిస్తున్నారని సమాచారం. ఇక తమిళ దర్శకుడు పా.రంజిత్(Pa Ranjith) దర్శకత్వంలో చియాన్ విక్రమ్(Chiyan Vikram) ప్రధాన పాత్రలో వస్తున్న తంగలాన్(Thangalaan) చిత్రంలో కూడా నటిస్తోంది మాళవిక. పాన్ ఇండియా లెవల్లో వస్తున్న ఈ రెండు సినిమాలి మాళవికాకు ఎలాంటి రిజల్ట్ ను ఇవ్వనున్నాయో తెలియాలంటే మరికొన్ని రోజులు ఆగాల్సిందే.