Usure Movie: సమాజంలోని ఓ బర్నింగ్ ఇష్యూతో.. రూరల్ లవ్‌‌‌‌‌‌‌‌ స్టోరీగా ‘ఉసురే’

Usure Movie: సమాజంలోని ఓ బర్నింగ్ ఇష్యూతో.. రూరల్ లవ్‌‌‌‌‌‌‌‌ స్టోరీగా ‘ఉసురే’

రాశి కీలకపాత్రలో టీజే అరుణాచలం, జననీ కునశీలన్‌‌‌‌‌‌‌‌ జంటగా నవీన్‌‌‌‌‌‌‌‌ డి గోపాల్‌‌‌‌‌‌‌‌ తెరకెక్కిస్తున్న చిత్రం ‘ఉసురే’. మౌళి ఎం రాధాకృష్ణ నిర్మిస్తున్న ఈ సినిమా ఆగస్టు 1న తెలుగు, తమిళ భాషల్లో విడుదల కానుంది.  మంగళవారం ఈ మూవీ సాంగ్స్‌‌‌‌‌‌‌‌ లాంచ్ ప్రెస్‌‌‌‌‌‌‌‌మీట్ జరిగింది. 

ఈ సందర్భంగా రాశి మాట్లాడుతూ ‘రియల్ ఇన్సిడెంట్స్ ఆధారంగా తెరకెక్కించారు. హీరోహీరోయిన్స్‌‌‌‌‌‌‌‌ నేచురల్‌‌‌‌‌‌‌‌గా నటించారు. ఇందులో మంచి ట్విస్ట్‌‌‌‌‌‌‌‌ ఉంది. నా పాత్ర చూసి అందరూ ఆశ్చర్యపోతారు’అని చెప్పారు.

‘చిత్తూరులోని ఓ గ్రామంలో చిత్రీకరించాం. ఓ అచ్చ తెలుగు సినిమా చూసిన ఫీలింగ్‌‌‌‌‌‌‌‌ కలుగుతుంది’అని దర్శకుడు చెప్పాడు. ‘సమాజంలోని ఓ బర్నింగ్ ఇష్యూతో హృదయానికి హత్తుకునే రూరల్ లవ్‌‌‌‌‌‌‌‌స్టోరీగా తెరకెక్కించాం’అని నిర్మాత తెలియజేశారు. హీరోహీరోయిన్స్‌‌‌‌‌‌‌‌ సహా టీమ్ పాల్గొన్నారు.