క చిత్రంలో హీరోయిన్‌‌‌‌‌‌‌‌గా సారిక నయన్

క చిత్రంలో హీరోయిన్‌‌‌‌‌‌‌‌గా సారిక నయన్

రీసెంట్‌‌‌‌‌‌‌‌గా విడుదలైన ‘ఆయ్’ చిత్రంతో హీరోయిన్‌‌‌‌‌‌‌‌గా టాలీవుడ్ ఎంట్రీ ఇచ్చి మొదటి సినిమాతోనే అందర్నీ ఆకట్టుకుంది నయన్ సారిక. తాజాగా ఆమె నటిస్తున్న మరో మూవీ అనౌన్స్‌‌‌‌‌‌‌‌మెంట్ వచ్చింది. కిరణ్ అబ్బవరం హీరోగా నటిస్తున్న ‘క’ చిత్రంలో నయన్ హీరోయిన్‌‌‌‌‌‌‌‌గా నటిస్తోంది.  ఆదివారం ఫస్ట్ లుక్ పోస్టర్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌తో పాటు ఆమె క్యారెక్టర్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ను పరిచయం చేశారు మేకర్స్. ఇందులో  సత్యభామగా కనిపించనుందని తన పాత్రను రివీల్ చేశారు. 

ఫస్ట్ లుక్ పోస్టర్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌లో  లంగావోణిలో ట్రెడిషనల్ మేకోవర్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌తో ఆకట్టుకుంది.  ఈ చిత్రంలో మరో హీరోయిన్‌‌‌‌‌‌‌‌గా తన్వీ రామ్ నటిస్తోంది. సుజీత్, సందీప్ దర్శకులుగా రూపొందిస్తున్న ఈ చిత్రాన్ని  చింతా గోపాలకృష్ణా రెడ్డి నిర్మిస్తున్నారు. ఇక ఈ రోజు సాయంత్రం ఈ మూవీ నుంచి ‘వరల్డ్ ఆఫ్ వాసుదేవ్’ పేరుతో ఫస్ట్ సాంగ్‌‌‌‌‌‌‌‌ రిలీజ్ కానుంది. సామ్ సీఎస్ సంగీతం అందిస్తున్నాడు.