మెగా రామ్ చరణ్ తో.. శ్రీలీల..డైరెక్టర్ బుచ్చిబాబు క్లారిటీ?

మెగా రామ్ చరణ్ తో.. శ్రీలీల..డైరెక్టర్ బుచ్చిబాబు క్లారిటీ?

ఉప్పెన ఫేమ్ డైరెక్టర్ బుచ్చిబాబు(Buchibabu).. రామ్ చరణ్(Ramcharan)  కాంబోలో మూవీ రానున్న విషయం తెలిసిందే. లేటెస్ట్ అప్డేట్ ప్రకారం ఈ మెగా ప్రాజెక్ట్ లో ఓ అచ్చమైన తెలుగు అమ్మాయి హీరోయిన్ గా సెలెక్ట్ అయ్యారని టాక్ వినిపిస్తుంది. రీసెంట్ గా డైరెక్టర్ బుచ్చిబాబు, శ్రీలీల(SreeLeela)  స్లం డాగ్ హస్బెండ్ మూవీ ప్రీ రిలీజ్ ఈవెంట్ కు గెస్ట్ గా వచ్చారు. 

అక్కడ ఆ ఫంక్షన్ లో బుచ్చిబాబు మాట్లాడుతూ.. 'టాలీవుడ్ ఎప్పుడు తెలుగు అమ్మాయిలు రావాలని అంటారు.. అలాంటి తెలుగు అమ్మాయిలను నా ఉప్పెన మూవీలో కూడా తీసుకోవడానికి ట్రై చేశాను..కుదరలేదు..కానీ ఇప్పుడు శ్రీలీల రెడీ గా ఉందంటూ..తన వైపు చూస్తూ మాట్లాడిన మాటలతో.. ఇక రామ్ చరణ్ మూవీలో హీరోయిన్ గా  తీసుకున్నారనే వార్తలు ఊపందుకున్నాయి. ఆమె కూడా ముసి ముసి నవ్వులు నవ్వడంతో కన్మర్మ్ అయిందనే వార్తలు వస్తున్నాయి. 

దీంతో  మెగా ఫ్యాన్స్ ఫుల్ ఖుషీలో ఉన్నారు. టాలీవుడ్ లో రాణించడానికి తెలుగు అమ్మాయిలు ఎప్పుడు రెడీ గా ఉంటారు. ఈ మధ్యే బేబీ మూవీతో వచ్చిన వైష్ణవి చైతన్య తెలుగు అమ్మాయి కావడం విశేషం. ఇక అధికారిక ప్రకటన రావాల్సి ఉంది. ఈ సినిమాకి సంబంధించిన ప్రీ ప్రొడక్షన్ వర్క్ జెట్ స్పీడ్‌లో జరుగుతోంది. త్వరలోనే రెగ్యులర్ షూటింగ్ కూడా మొదలుకానుంది. 

ప్రస్తుతం శంకర్(Shankar) దర్శకత్వంలో గేమ్ ఛేంజర్(Game Changer) మూవీ చేస్తున్న రామ్ చరణ్.. ఈ సినిమా కంప్లీట్ అవగానే బుచ్చిబాబు సినిమా షూటింగ్ లో జాయిన్ అవుతారు. ఈ మెగా ప్రాజెక్ట్ కోసం మ్యూజిక్ సెన్సేషన్ ఏఆర్ రెహమాన్ స్వరాలు సమకూరుస్తున్నట్లు టాక్ వినిపిస్తోంది. ఈ సినిమాను మైత్రీ మూవీ మేకర్స్ సమర్పణలో వెంకట సతీష్ కిలారు వృద్ధి సినిమాస్, సుకుమార్ రైటింగ్స్ బ్యానర్‌లపై అత్యంత భారీ బడ్జెట్‌తో నిర్మించనున్నారు.