
హైదరాబాద్, వెలుగు: హెటెరో హెల్త్‌కేర్ లిమిటెడ్ హెచ్‌ఈఆర్ 2- పాజిటివ్ బ్రెస్ట్ క్యాన్సర్ చికిత్సకు ఉపయోగించే పెర్టుజుమాబ్ బయోసిమిలర్ పర్జియాను అందుబాటులోకి తెచ్చింది. ఎంజైన్ బయోసైన్సెస్ లిమిటెడ్‌తో కలిసి దీనిని లాంచ్ చేసింది. పర్జియా 420 ఎంజీ ఇంజెక్షన్ ధర రూ.30 వేలు. పెర్టుజుమాబ్‌ను క్యాన్సర్ చికిత్సలో ట్రాస్టుజుమాబ్, కీమోథెరపితో కలిపి ఉపయోగిస్తున్నారు.
పర్జియా లాంచ్‌తో వేలాది మంది భారతీయ రోగులకు అధునాతన చికిత్సలు తక్కువ ఖర్చుతో అందుబాటులోకి రానున్నాయి. హెటెరో ఎండీ శ్రీనివాస్ రెడ్డి మాట్లాడుతూ, అఫోర్డబిలిటీ, ఇన్నొవేషన్‌పై సంస్థ దృష్టి సారిస్తోందని అన్నారు. ఎంజైన్ సీఈఓ హిమాంశు గాడ్గిల్ ఈ భాగస్వామ్యాన్ని భారత క్యాన్సర్ చికిత్సలో మార్పుకు సంకేతంగా అభివర్ణించారు. ఆంకాలజి, యాంటివైరల్స్, క్రిటికల్ కేర్ విభాగాలపై హెటెరో హెల్త్‌కేర్ ఫోకస్ పెంచింది.