ధవన్ ఫామ్‌‌ను ఇలాగే కొనసాగించాలి

ధవన్ ఫామ్‌‌ను ఇలాగే కొనసాగించాలి

అహ్మదాబాద్: టీమిండియా ఓపెనర్ శిఖర్ ధవన్ ఐపీఎల్‌లో చెలరేగుతున్నాడు. వరుసగా అర్ధ సెంచరీలతో ఆకట్టుకుంటున్నాడు. ప్రస్తుతం అతడు లీగ్‌లో టాప్ బ్యాట్స్‌మన్ లిస్ట్‌లో తొలి స్థానంలో నిలిచాడు. పంజాబ్ కింగ్స్‌‌తో ఆదివారం జరిగిన మ్యాచ్‌లోనూ ధవన్ (66) రన్స్‌తో మరోసారి సత్తా చాటాడు. ఈ క్రమంలో ధవన్ ఆటతీరుపై లెజెండరీ క్రికెటర్ సునీల్ గవాస్కర్ స్పందించాడు. గబ్బర్ సూపర్ ఫామ్‌‌లో ఉన్నాడని, దీన్ని ఇలాగే కొనసాగించాలని సూచించాడు. 

‘ఈ సీజన్ ఐపీఎల్ ప్రారంభమైనప్పటి నుంచి ధవన్ మంచి ఫామ్‌లో ఉన్నాడు. అతడు తన ఫామ్‌ను కొనసాగిస్తున్నాడు. ప్రతి మ్యాచ్‌‌ను సీరియస్‌గా తీసుకొని ఆడటం శుభపరిణామం. కొంత మంది బ్యాట్స్‌‌మన్ మంచి ఫామ్‌లో ఉన్నప్పుడు తొందరపడుతుంటారు. కానీ ధవన్ అలా చేయడం లేదు. ఎక్కువగా పరుగులు వచ్చే షాట్లనే ఆడుతున్నాడు. అంతేగాకుండా మ్యాచ్‌‌లను ఫినిష్ చేస్తున్నాడు’ అని గవాస్కర్ ప్రశంసించాడు.