హైదరాబాద్, వెలుగు: విమానయాన రంగం కోసం హైదరాబాద్లో నిర్వహించిన వింగ్స్ ఇండియా సందర్భంగా హిందుస్థాన్ గ్రూప్ ఆఫ్ ఇన్స్టిట్యూషన్స్కు చెందిన శిక్షణా సంస్థ హిందుస్తాన్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ ఇంజినీరింగ్ అండ్ టెక్నాలజీ (హెచ్ఐఈటీ) ఎయిర్ ఇండియాతో ఒప్పందం కుదుర్చుకుంది. ఈ ఎంఓయూ ద్వారా విమాన నిర్వహణ, ఇంజినీరింగ్ విభాగంలో ఏఎంఈ క్యాడెట్ ప్రోగ్రామ్ ప్రారంభం కానుంది.
లైసెన్స్డ్ విమాన నిర్వహణ ఇంజినీర్లకు శిక్షణ ఇస్తారు. ఈ సంస్థకు చెందిన ఓరియంట్ ఫ్లైట్స్ ఏవియేషన్ అకాడమీ (ఓఎఫ్ఏఏ) తన విమానాల్లో కొత్త టెక్నామ్ శిక్షణ విమానాన్ని చేర్చింది. దీనిద్వారా నైపుణ్యం కలిగిన పైలట్లను, ఇంజినీర్లను తయారు చేస్తామని గ్రూప్ చైర్మన్ డాక్టర్ ఆనంద్ జాకబ్ వర్గీస్ తెలిపారు.
