రామప్పలో హై అలర్ట్

రామప్పలో హై అలర్ట్

వెంకటాపూర్ (రామప్ప ), వెలుగు: ఢిల్లీలో బాంబు బ్లాస్ట్ ఘటన నేపథ్యంలో యునెస్కో గుర్తింపు పొందిన రామప్ప ఆలయం వద్ద ములుగు జిల్లా పోలీసులు హై అలర్ట్ అయ్యారు. కేంద్ర భద్రత నిఘా విభాగం సూచనలతో  మంగళవారం సాయంత్రం రామప్ప టెంపుల్ లో బాంబు స్క్వాడ్ తో తనిఖీలు నిర్వహించారు. డాగ్ స్క్వాడ్ టీమ్, మెటల్ డిటెక్టర్ తో పరిసరాలను తనిఖీ చేశారు. ఆలయ పరిసరాల చుట్టూ కట్టుదిట్టమైన భద్రతను కల్పించారు. పర్యాటకులు రాకపోకలు, అనుమానితుల కదలికలపై నిఘా పెట్టారు.