గణేష్ నిమజ్జనోత్సవంలో పోలీసుల అలర్ట్

గణేష్ నిమజ్జనోత్సవంలో పోలీసుల  అలర్ట్

రాష్ట్ర వ్యాప్తంగా 40 వేల మందితో బందోబస్తు

కోవిడ్ నిబంధనలు పాటిచమంటూ మైక్ లలో నిరంతరం ప్రకటనలు

హైదరాబాద్: గణేష్ నిమజ్జనోత్సవం సందర్భంగా పోలీసుల శాఖ హై అలర్ట్ ప్రకటించింది. ఇప్పటికే కోవిడ్ నిబంధనలు పాటించమంటూ నిర్వాహకులకు, వాలంటీర్లకు పలుమార్లు సూచనలు ఇచ్చిన పోలీసులు రాష్ట్ర వ్యాప్తంగా 40 వేల మందితో బందోబస్తు నిర్వహిస్తోంది. నిమజ్జనోత్సవానికి వస్తున్న.. వెళ్తున్న వారు కోవిడ్ నిబంధనలు పాటించమంటూ.. మైక్ లలో నిరంతరం ప్రకటనలు చేయిస్తోంది. నిబంధనలు ఉల్లంఘిస్తే చట్ట రీత్యా చర్యలు తప్పవు సున్నితంగానే పోలీసులు హెచ్చరికలు చేస్తున్నారు.

సీసీ కెమెరాలతో నిఘా

హైదరాబాద్ లో మూడు కమిషనరేట్ పరిధిలో ఏర్పాటు చేసిన సీసీటీవీ కెమెరా ల ద్వారా నిమాజ్జన వేడుకల్ని పోలీసులు నిరంతరం డేగ కళ్లతో పరీశీలిస్తున్నారు. ఎక్కడైనా ట్రాపిక్ జామ్ ఏర్పడడం లేదా అదుపు తప్పడం జరుగుతుంటే.. వెంటనే ఆయా ప్రాంతాల్లోని పోలీసులు.. వలంటీర్లకు ఫోన్ చేసి అప్రమత్తం చేస్తున్నారు. చెరువులు.. కుంటలు.. కాలువల్లో నిమజ్జనం జరిగే ప్రదేశాల్లో గజ ఈత గాళ్లను అందుబాటులో ఉంచి ఎప్పటికప్పుడు సూచనలు చేస్తున్నారు. హైదరాబాద్, రాచకొండ, సైబరాబాద్ ప్రాంతాల్లో ఉన్న సమస్యాత్మక ప్రాంతాల్లో ముందు జాగ్రత్తగా పటిష్ట చర్యలు చేపట్టిన పోలీసులు… నిమజ్జనోత్సవం ప్రశాంతంగా.. విజయవంతంగా జరిగేలా భక్తులు, గణేష్ ఉత్సవ సమితి నాయకులు సహకరించాలని కోరుతున్నారు.