
ఆర్టీసీ సమ్మెపై హైకోర్టులో దాఖలైన హౌస్ మోషన్ పిటిషన్ పై వాదనలు ముగిశాయి. విచారణను ఈ నెల 10కు వాయిదా వేస్తున్నట్టు ప్రకటించింది కోర్టు. కౌంటర్ దాఖలు చేయాలని ప్రభుత్వానికి, RTC యాజమాన్యాన్ని ఆదేశించింది. రెండు గుర్తింపు సంఘాలకు నోటీసులు ఇచ్చింది. అంతకుముందు.. కుందన్ బాగ్ లోని న్యాయమూర్తి నివాసంలో రెండువర్గాలు వాదనలు వినిపించాయి.
సమ్మె వెంటనే విరమించేలా చర్యలు తీసుకునేలా ఆదేశించాలని పిటిషనర్ కోర్టును కోరారు. అయితే.. కార్మికుల డిమాండ్లు న్యాయబద్ధంగా లేవని కోర్టుకు తెలిపింది ప్రభుత్వం. ఆర్టీసీ కార్మికుల సమస్యలపై కమిటీ వేశామని.. ప్రభుత్వం కోర్టుకు చెప్పింది. ఇచ్చిన హామీలను ప్రభుత్వం తప్పకుండా నెరవేరుస్తుందని కోర్టుకు తెలిపింది.