గ్రూప్ 1 పై హైకోర్టులో విచారణ..ఫిబ్రవరి 5కు తీర్పు వాయిదా

గ్రూప్ 1 పై హైకోర్టులో విచారణ..ఫిబ్రవరి 5కు తీర్పు వాయిదా

గ్రూప్‌-1 మెయిన్స్‌ ఎగ్జామ్స్  పిటిషన్ పై తీర్పును హైకోర్టు వాయిదా వేసింది. సింగిల్ బెంచ్ ఇచ్చిన తీర్పును  చీఫ్ కోర్టులో TGPSC అప్పీల్ చేయగా  గురువారం(జనవరి 22)  విచారణ చేపట్టిన డివిజన్ బెంచ్ తీర్పును ఫిబ్రవరి 5కు వాయిదా వేసింది.  తీర్పు కాపీ సిద్ధం కాలేదని లాయర్లకు వెల్లడించి విచారణను వాయిదా వేసింది హైకోర్టు డివిజన్ బెంచ్. 

అనేక మలుపులు తిరిగిన గ్రూప్‌-1 మెయిన్స్‌ ఎగ్జామ్‌లో ఇప్పటికే నియామకాలు పూర్తికాగా, 562 మందికి సర్కార్‌ నియామక పత్రాలు కూడా అందజేసింది టీజీఎస్ పీఎస్సీ. గతంలో హైకోర్టు సింగిల్‌ బెంచ్‌ ఫలితాలు రద్దుచేసి, తిరిగి మూల్యాంకనం చేయాలని తీర్పు ఇచ్చింది. ఈ తీర్పు పై డివిజన్‌ బెంచ్‌ స్టే విధించి, తుది తీర్పునకు లోబడే నియామకాలు ఉండాలని స్పష్టంచేసింది.