ఏపీలో లిక్కర్ అమ్మకాలపై హైకోర్టులో విచారణ వచ్చేవారానికి వాయిదా

ఏపీలో లిక్కర్ అమ్మకాలపై హైకోర్టులో విచారణ వచ్చేవారానికి వాయిదా

లాక్ డౌన్ కొనసాగుతున్న సమయంలో లిక్కర్ ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం అమ్మకాలు జరుపుతోందంటూ  ఆ రాష్ట్ర ప్రభుత్వానికి వ్యతిరేకంగా దాఖలైన పిటిషన్లపై ఇవాళ(మంగళవారం) విచారణ చేపట్టింది హైకోర్టు. మద్యం అమ్మకాలను నిలిపివేయాలంటూ కోర్టులో 3 పిటిషన్లు దాఖలయ్యాయి. మద్యం అమ్మకాల సమయంలో భౌతికదూరం పాటించడం లేదంటూ పిటిషనర్లు ఆరోపించారు. నిబంధనలు పాటించకపోతే కరోనా మరింత వ్యాపిస్తుందని తెలిపారు.

ప్రభుత్వం తమ వాదనలు వినిపిస్తూ… నిబంధనలకు అనుగుణంగానే వైన్ షాపులకు అనుమతి ఇచ్చామని తెలిపింది. ఇరు పక్షాల వాదనలు విన్న హైకోర్టు… మద్యం అమ్మకాలపై సుప్రీంకోర్టులో పిటిషన్ పెండింగ్ లో ఉన్నందున తదుపరి విచారణను వచ్చే వారానికి వాయిదా వేస్తున్నట్లు తెలిపింది.