హైదరాబాద్, వెలుగు : కాశ్మీర్ పండిట్లపై వివాదాస్పద వ్యాఖ్యల కేసులో నటి సాయిపల్లవి దాఖలు చేసిన పిటిషన్‌ను తెలంగాణ హైకోర్టు గురువారం కొట్టివేసింది. భజరంగ్‌దళ్ సభ్యుడి ఫిర్యాదుతో జూన్‌లో సుల్తాన్‌బజార్ పోలీసులు ఆమెపై కేసు నమోదు చేసి జూన్ 21న నోటీసు పంపారు. ఆ నోటీసు రద్దుచేయాలని సాయిపల్లవి హైకోర్టును ఆశ్రయించారు. కాగా ఆమె అభ్యర్థనను కోర్టు కొట్టివేసింది. విరాట్ పర్వం సినిమా ప్రమోషన్ కార్యక్రమంలో కాశ్మీర్ పండిట్ల హత్యలు, గో హత్యల గురించి సాయిపల్లవి మాట్లాడారు. ఆమె చేసిన వ్యాఖ్యలు హిందువుల మనోభావాల్ని దెబ్బతీసేలా ఉన్నాయంటూ భజరంగ్‌దళ్ మెంబర్ అఖిల్, సుల్తాన్ బజార్ పోలీసులకు ఫిర్యాదు చేశారు. దీనిపై గత నెల 21న ఆమెకు నోటీసులిచ్చారు.
