హైదరాబాద్, వెలుగు: మన్‌సాన్‌పల్లి ఫేజ్–1, ఫేజ్–2లో 2,412 డబుల్‌బెడ్రూం ఇండ్లు నిర్మాణ పనుల కాంట్రాక్ట్ ను సవాల్ చేసిన పిల్‌ను హైకోర్టు కొట్టేసింది. ఎలాంటి టెండర్ ప్రక్రియ చేపట్టకుండానే నిర్మాణ పనుల్ని డీఈసీ ఇన్ఫ్రాస్ట్రక్చర్ ప్రాజెక్ట్స్ ఇండియా లిమిటెడ్‌కు ఇవ్వడంపై నిజామాబాద్‌కు చెందిన జి.చందు పిల్ దాఖలు చేశారు. ఈ పిల్‌ను విచారించిన చీఫ్ జస్టిస్ అలోక్ అరాధే, జస్టిస్ వినోద్‌కుమార్‌ల డివిజన్ బెంచ్ తీర్పు చెప్పింది.
ఆ ఇండ్ల నిర్మాణ పనుల్ని కాంట్రాక్ట్ పొందినవాళ్లు నిబంధనలకు అనుగుణంగా 2020 నాటికి పూర్తి చేయలేక వదిలేశారని, ఆ తర్వాత డీఈసీ ఇన్ఫ్రాస్ట్రక్చర్ ప్రాజెక్ట్స్ ఇండియా లిమిటెడ్‌తో ప్రభుత్వం చర్చలు జరిపిన తర్వాతే అప్పగించిందని తెలిపింది. కాగా, గట్టుపల్లిలో 1,192 ఇండ్లును ప్రభుత్వం మంజూరు చేసింది. మునుగూరులో 1,296 ఇండ్ల నిర్మాణపు పనుల్ని కూడా కాంట్రాక్టర్‌కు ఇచ్చింది. అయితే ఇండ్ల నిర్మాణాన్ని కాంట్రాక్టర్ 2020 నాటికి పూర్తి చేయలేక మధ్యలో వదిలేశాడు.
దీంతో ప్రభుత్వం డీఈసీ ఇన్ఫ్రాస్ట్రక్చర్ ప్రాజెక్ట్స్ ఇండియా లిమిటెడ్‌కు పనులు అప్పగించిందని బెంచ్వివరించింది. 2020లో ఇండ్ల నిర్మాణాలకు కాంట్రాక్ట్ అప్పగిస్తే వాటిని 2022 నాటికి పూర్తి చేసినట్లు పిల్ దాఖలు చేయడం సరికాదని డివిజన్ బెంచ్ పేర్కొంది. గతంలోని మధ్యంతర ఉత్తర్వులను రద్దు చేసింది. కాంట్రాక్టర్‌కు చట్ట ప్రకారం బిల్లులను చెల్లించాలని ప్రభుత్వాన్ని ఆదేశించింది. మన్‌సాన్‌పల్లి ఫేజ్–1, ఫేజ్–2లో 2,412 డబుల్‌బెడ్రూం ఇండ్లు నిర్మాణ పనుల కాంట్రాక్ట్ ను సవాల్ చేసిన పిల్‌ను హైకోర్టు కొట్టేసింది.
ఎలాంటి టెండర్ ప్రక్రియ చేపట్టకుం డానే నిర్మాణ పనుల్ని డీఈసీ ఇన్ఫ్రాస్ట్రక్చర్ ప్రాజెక్ట్స్ ఇండియా లిమిటెడ్‌కు ఇవ్వడంపై నిజామాబాద్‌కు చెందిన జి.చందు పిల్ దాఖలు చేశారు. ఈ పిల్‌ను విచారించిన చీఫ్ జస్టిస్ అలోక్ అరాధే, జస్టిస్ వినోద్‌కుమార్‌ల డివిజన్ బెంచ్ తీర్పు చెప్పింది.
ఆ ఇండ్ల నిర్మాణ పనుల్ని కాంట్రాక్ట్ పొందినవాళ్లు నిబంధనలకు అనుగుణంగా 2020 నాటికి పూర్తి చేయలేక వదిలేశారని, ఆ తర్వాత డీఈసీ ఇన్ఫ్రాస్ట్రక్చర్ ప్రాజెక్ట్స్ ఇండియా లిమిటెడ్‌తో ప్రభుత్వం చర్చలు జరిపిన తర్వాతే అప్పగించిందని తెలిపింది. కాగా, గట్టుపల్లిలో 1,192 ఇండ్లును ప్రభుత్వం మంజూరు చేసింది. మునుగూరులో 1,296 ఇండ్ల నిర్మాణపు పనుల్ని కూడా కాంట్రాక్టర్‌కు ఇచ్చింది. అయితే ఇండ్ల నిర్మాణాన్ని కాంట్రాక్టర్ 2020 నాటికి పూర్తి చేయలేక మధ్యలో వదిలేశాడు.
దీంతో ప్రభుత్వం డీఈసీ ఇన్ఫ్రాస్ట్రక్చర్ ప్రాజెక్ట్స్ ఇండియా లిమిటెడ్‌కు పనులు అప్పగించిందని బెంచ్వివరించింది. 2020లో ఇండ్ల నిర్మాణాలకు కాంట్రాక్ట్ అప్పగిస్తే వాటిని 2022 నాటికి పూర్తి చేసినట్లు పిల్ దాఖలు చేయడం సరికాదని డివిజన్ బెంచ్ పేర్కొంది. గతంలోని మధ్యంతర ఉత్తర్వులను రద్దు చేసింది. కాంట్రాక్టర్‌కు చట్ట ప్రకారం బిల్లులను చెల్లించాలని ప్రభుత్వాన్ని ఆదేశించింది.