హైకోర్టులో రేవంత్కు ఊరట..2016లో నమోదైన కేసు కొట్టివేత

హైకోర్టులో రేవంత్కు ఊరట..2016లో నమోదైన కేసు కొట్టివేత

హైదరాబాద్, వెలుగు: ఎంపీగా ఉన్న టైంలో రేవంత్‌ రెడ్డిపై గచ్చిబౌలి( 2016)లో నమోదైన ఎస్సీ, ఎస్టీ కేసును హైకోర్టు కొట్టివేస్తూ గురువారం తీర్పు వెలువరించింది. ఆధారాల్లేకుండా ఆరోపణలతో ఫిర్యాదు చేశారని తప్పుబట్టింది. ఘటనాస్థలంలో రేవంత్‌ రెడ్డి ఉన్నట్లు ఆధారాల్లేవని పేర్కొన్నది. 2016లో ఓ భూ వివాదానికి సంబంధించి గచ్చిబౌలి పోలీస్ స్టేషన్‌లో తనపై నమోదైన ఎస్సీ, ఎస్టీ కేసు కొట్టేయాలని కోరుతూ రేవంత్‌ రెడ్డి 2020లో హైకోర్టులో పిటివేశారు. 

దీనిపై జస్టిస్‌ మౌసమీ భట్టాచార్య గురువారం తీర్పు చెప్పారు. గోపన్నపల్లిలో 31 ఎకరాలకు హక్కుల వివాదంలో ఎస్సీ మ్యూచువల్లీ ఎయిడెడ్‌ కో ఆపరేటివ్‌ హౌసింగ్‌ సొసైటీకి, రేవంత్‌రెడ్డి సోదరుడు కొండల్‌ రెడ్డి, ఎ.లక్ష్మయ్య మధ్య వివాదం ఉన్నది. ఎంపీగా ఉన్న రేవంత్‌ అండతోనే సొసైటీ స్థలంలోకి అక్రమంగా చొరబడ్డారని, ఎస్సీ కులం పేరుతో దూషించారని సొసైటీకి చెందిన ఎన్‌.పెద్దిరాజు పోలీసులకు ఫిర్యాదు చేశారు.