రెండు యూనివర్సిటీల వీసీలకు హైకోర్టు నోటీసులు

V6 Velugu Posted on Aug 04, 2021

హైదరాబాద్: కాకతీయ, తెలుగు యూనివర్సిటీల వీసీలకు హైకోర్టు నోటీసులు జారీ చేసింది. నిబంధనలకు విరుద్ధంగా కేయూ, తెలుగు వర్సిటీ వీసీల నియామకం జరిగిందని విశ్రాంత ప్రిన్సిపల్ విద్యాసాగర్ హైకోర్టులో పిల్ వేశారు. ఈ పిల్‌‌పై సీజే జస్టిస్ హిమా కోహ్లీ, జస్టిస్ విజయసేన్ రెడ్డి ధర్మాసనం విచారణ చేపట్టింది. కేయూ వీసీకి పదేళ్ల అనుభవం లేదని, అదేవిధంగా తెలుగు వర్సిటీ వీసీకి 70 ఏళ్లు దాటాయని పిటిషనర్ తరపు న్యాయవాది వాదించారు. ఈ విషయంపై వివరణ ఇవ్వాలని రాష్ట్ర ప్రభుత్వం, యూజీసీకి హైకోర్టు ఆదేశాలు జారీ చేసింది. అదేవిధంగా కేయూ వీసీ రమేష్, తెలుగు వర్సిటీ వీసీ కిషన్ రావులకు హైకోర్టు నోటీసులిచ్చింది. నాలుగు వారాల్లో కౌంటర్ దాఖలు చేయాలని ప్రభుత్వాన్ని హైకోర్టు ఆదేశించింది. తదుపరి విచారణను అక్టోబరు 27కి వాయిదా వేసింది.

Tagged Hyderabad, Telangana, kakatiya university, Telangana High Court, ugc, telugu university, VC Ramesh, VC Kishan Rao

Latest Videos

Subscribe Now

More News