ఇప్పుడే అందిన వార్త : ట్యాంక్ బండ్‌పై గణేష్ నిమజ్జనానికి హైకోర్టు ఓకే

ఇప్పుడే అందిన వార్త : ట్యాంక్ బండ్‌పై గణేష్ నిమజ్జనానికి హైకోర్టు ఓకే

హైదరాబాద్‌లో గణేష్‌ విగ్రహాల నిమజ్జనాలపై తెలంగాణ హైకోర్టు కీలక తీర్పు ఇచ్చింది. హుస్సేన్‌సాగర్‌లో గణేష్‌ విగ్రహాల నిమజ్జనానికి కోర్టు గ్రీన్‌సిగ్నల్‌ ఇచ్చింది. హైదరాబాద్‌లోని హుస్సేన్‌సాగర్‌లో గణేష్‌ విగ్రహాల నిమజ్జనం అంశంపై హైకోర్టులో లాయర్ వేణుమాధవ్ పిటిషన్‌ దాఖలు చేశారు. హుస్సేన్‌సాగర్‌లో విగ్రహాల నిమజ్జనం చేయవద్దని గతంలో ఇచ్చిన హైకోర్టు ఆదేశాలు అమలు చేయాలని పిటిషనర్‌ తన పిటిషన్‌లో కోరారు. ఈ క్రమంలో హైడ్రాను కూడా పిటిషనర్‌.. ప్రతివాదిగా చేర్చాలని కూడా కోరారు. ఈ పిటిషన్‌పై ధర్మాసనం మంగళవారం విచారణ చేపట్టింది. 

ఈ క్రమంలో హుస్సేన్ సాగర్‌లో నిమజ్జనాలు వద్దని పిటిషనర్ తన వాదనలు వినిపించారు. గతేడాది ఇచ్చిన తీర్పునే ఈసారి కొనసాగించాలని రిక్వెస్ట్ చేశారు. అదేవిధంగా హైడ్రాను కూడా ఇందులో ప్రతివాదిగా చేర్చాలని కోరారు. పూర్తి వాదనలు విన్న ధర్మాసనం హైడ్రాను ప్రతివాదిగా చేర్చేందుకు నిరాకరించింది. ఆ పిటిషన్‌ను హైకోర్టు ధర్మాసనం తోసిపుచ్చింది. చివరి నిమిషంలో కోర్టు ధిక్కరణ పిటిషన్ సరికాదని కోర్టు తప్పుబట్టింది. విగ్రహాల నిమజ్జనం విషయంలో 2021లో ఇచ్చిన ఆదేశాలనే పాటించాలని హైకోర్టు తీర్పు ఇచ్చింది. దీంతో హుస్సేన్ సాగర్‌లో వినాయక నిమజ్జనాలకు లైన్ క్లియర్ అయింది.