రవిప్రకాశ్ కు బెయిల్

రవిప్రకాశ్ కు బెయిల్

TV-9 మాజీ సీఈఓ రవిప్రకాశ్‌ బెయిల్‌పై విడుదలయ్యారు. డైరెక్టర్ల అనుమతి లేకుండానే నకిలీ మెయిల్ ఐడీ సృష్టించి…కోట్లాది రూపాయలను దుర్వినియోగం చేసిన కేసులో రవిప్రకాశ్‌ చంచల్‌గూడ జైలులో రిమాండ్ ఖైదీగా ఉన్నారు. హైకోర్టు బెయిల్ మంజూరు చేయడంతో ఇవాళ (శనివారం) ఉదయం జైలు నుంచి విడుదలయ్యారు.

ఏబీసీఎల్‌ను రూ.18 కోట్లకు మోసగించిన కేసులో రవిప్రకాశ్‌ కొన్ని రోజులుగా చంచల్‌గూడ జైలులో ఉన్నారు. ఆ కేసులో హైకోర్ట్ బెయిల్ మంజూరు చేసింది. అయితే నకిలీ మెయిల్ ఐడీ సృష్టించి ఏబీసీల్‌ను మోసం చేసిన కేసులో అదే రోజు సైబరాబాద్ పోలీసులు పీటి వారెంట్‌పై  అదుపులోకి తీసుకొని కూకట్‌పల్లి న్యాయస్థానంలో హాజరుపరిచారు. కోర్టు ఆదేశాలతో పోలీసులు రిమాండ్‌కు తరలించారు.