టీఆర్ఎస్ అధినేత, సీఎస్ లకు హైకోర్టు నోటీసులు

టీఆర్ఎస్ అధినేత, సీఎస్ లకు హైకోర్టు నోటీసులు

బంజారాహిల్స్ లో టీఆర్ఎస్ పార్టీ కార్యాలయానికి భూమి కేటాయింపుపై టీఆర్ఎస్ కు హైకోర్టు నోటీసులిచ్చింది. హైదరాబాద్ బంజారాహిల్స్ లోని NBT నగర్ లో TRS పార్టీ కార్యాలయానికి జరిగిన భూమి కేటాయింపుపై పిల్ దాఖలైంది. కోట్లు విలువ చేసే భూమిని తక్కువ ధరకు కేటాయించారని పిటిషన్ వేశారు. పిటిషనర్ తరపున వాదనలు విన్న ప్రధాన ధర్మాసనం టీఆర్ఎస్ పార్టీ ప్రెసిడెంట్, జనరల్ సెక్రటరీ, సీఎస్, హైదరాబాద్ కలెక్టర్ కు నోటీసులు ఇచ్చారు. వీరితో పాటు రెవెన్యూ ప్రిన్సిపల్ సెక్రటరీకి కూడా నోటీసులిచ్చారు. కోట్లు విలువ చేసే భూమిని కేటాయించారంటూ పిటీషనర్ తరపు న్యాయవాది కోర్టుకు తెలిపారు. హైదరాబాద్ సహా 33 జిల్లాల్లో ఇదే విధంగా జరిగిందన్నారు పిటిషనర్. దీనిపై నాలుగు వారాల్లో వివరణ ఇవ్వాలని హై కోర్టు ఆదేశించింది.