హైదరాబాద్, వెలుగు : అక్టోబర్ 10న కేసుల విచారణను హైకోర్టు లైవ్ ఇవ్వనుంది. టెస్ట్ బెసిస్‌లో ఫస్ట్ కోర్టు హాల్‌లో జరిగే కేసు విచారణను లైవ్ ఇచ్చేందుకు ఏర్పాట్లు చేసినట్లు హైకోర్టు తెలిపింది. లైవ్ వెబ్ లింక్‌ను త్వరలో తెలియజేస్తామని, లైవ్‌లో లోపాలుంటే చర్యలు తీసుకుంటామని చెప్పింది. 29 నుంచి దసరా సెలవులు: రాష్ట్ర హైకోర్టుకు గురువారం నుంచి అక్టోబర్ 7 వరకు దసరా సెలవులు ప్రకటిస్తూ ఉత్తర్వులు జారీ అయ్యాయి. అత్యవసర కేసులను ఈ నెల 30న ఫైలింగ్ చేస్తే వాటిని అక్టోబర్ 6న వెకేషన్ కోర్టు విచారిస్తుంది. జస్టిస్ కె.లక్ష్మణ్, జస్టిస్ సుమలత డివిజన్ బెంచ్ అత్యవసర కేసుల విచారణ చేశాక.. వారిద్దరూ అదే రోజున సింగిల్‌గా కూడా కేసుల విచారణ చేస్తారు.
