చెప్పేదొకటి చేసేదొకటి.. రాష్ట్ర సర్కార్‌‌‌పై హైకోర్టు అసహనం

చెప్పేదొకటి చేసేదొకటి.. రాష్ట్ర సర్కార్‌‌‌పై హైకోర్టు అసహనం

హైదరాబాద్: ధరణి పోర్టల్‌‌లో ఆస్తుల నమోదుపై హైకోర్టు విచారణ జరిపింది. వ్యవసాయేతర ఆస్తుల నమోదు మీద రేపటి వరకు కోర్టు స్టే పొడిగించింది. పాత పద్ధతిలో రిజిస్ట్రేషన్ చేస్తామని గతంలో హైకోర్టుకు ప్రభుత్వం చెప్పినప్పటికీ అది అమలు కావడం లేదని పిటిషనర్ తరఫు న్యాయవాది దేశాయి ప్రకాష్ న్యాయస్థానానికి తెలిపారు.

వ్యవసయేతర ఆస్తుల నమోదుపై వ్యక్తిగత వివరాలతోపాటు కొనుగోలుదారులు, అమ్మకందారుల కుటుంబ సభ్యుల వివరాల మీద పిటిషనర్ అభ్యoతరం వ్యక్తం చేశారు. ఆధార్ కార్డ్ వివరాలు తీసుకోవద్దని గతంలో చెప్పినప్పటికీ ప్రభుత్వం వివరాలు సేకరిస్తోందని పిటిషనర్ కోర్టుకు తెలపారు. దీనిపై కోర్టు సీరియస్ అయ్యింది. ప్రభుత్వం తమకు చెప్తోంది ఒకటి బయట చేస్తోంది మరొకటని హైకోర్టు అసహనం వ్యక్తం చేసింది. పూర్తి వివరాలతో కౌంటర్ అఫిడవిట్ సమర్పించాలని సర్కార్‌‌‌ను అదేశించింది. తదుపరి విచారణను రేపటికి వాయిదా వేసింది.