ఆరుగురు ఎమ్మెల్యేల ఎన్నిక చెల్లదంటూ దాఖలైన పిటిషన్ లపై హైకోర్టు విచారణ జరిపింది. ఎన్నికల అఫిడవిట్ లో తప్పుడు సమాచారం పొందుపరిచారంటూ దాఖలైన పిటీషన్ పై విచారణ చేసి… ఆరుగురు ఎమ్మెల్యేలను కౌంటర్ ధాఖలు చేయాలని ఆదేశించింది.. ఆరుగురు ఎమ్మెల్యేలు… వికారాబాద్ ఎమ్మెల్యే మెతుకురు ఆనంద్, పరిగి ఎమ్మెల్యే.. మహేష్ రెడ్డి, జనగామ ఎమ్మెల్యే ముత్తిరెడ్డి యాదగిరి రెడ్డి, కొడంగల్ ఎమ్మెల్యే పట్నం నరేందర్ రెడ్డి, వరంగల్ ఈస్ట్ ఎమ్మెల్యే నన్నపనేని నరేందర్, మల్కాజిగిరి ఎమ్మెల్యే మైనంపల్లి హనుమంతరావు లు ఉన్నారు. తదుపరి విచారణను నాలుగు వారాలకు వాయిదా వేసింది హైకోర్టు.
