కాంట్రాక్ట్​ ఉద్యోగులను రెగ్యులరైజ్ చేయండి

కాంట్రాక్ట్​ ఉద్యోగులను రెగ్యులరైజ్ చేయండి
  • పోలీస్ ​హౌసింగ్ కార్పొరేషన్​కు హైకోర్టు ఆదేశం

హైదరాబాద్, వెలుగు: ఏండ్ల తరబడి పనిచేస్తున్న కాంట్రాక్ట్ ఉద్యోగులను పోలీస్ హౌసింగ్ కార్పొరేషన్ తొలగించడాన్ని హైకోర్టు తప్పు పట్టింది. రెగ్యులర్ నియామకాల పేరుతో వారి ని తొలగించడం  న్యాయ విరుద్ధమని తెలిపింది.  కాగా, 2012 నుంచి పోలీస్​ హౌసింగ్ కార్పొరేషన్లో  ఇంజినీరు, జూనియర్ అసిస్టెంట్లుగా  కాంట్రాక్ట్ పద్ధతిన కొంతమంది పనిచేస్తున్నారు. వారిని నిబంధనల ప్రకారం రెగ్యులరైజ్​చేసేందుకు చర్యలు తీసుకోవాలని కార్పొరేషన్ ను హైకోర్టు ఆదేశించింది.

 సర్వీసు క్రమబద్ధీకరణ కోసం పిటిషనర్లు వినతిపత్రం సమర్పించాలని కోర్టు సూచించింది. వారి వినతిని పరిశీలించి మూడు నెలల్లో క్రమబద్ధీకరణపై నిర్ణయం తీసుకోవాలని సూచించింది. వయో పరిమితి మినహాయింపు అంశాన్ని పరిశీలించాలని, అప్పటివరకు వాళ్లను సర్వీసు నుంచి తొలగించరాదని ఆదేశించింది.వారి స్థానంలో ఇతరులను నియమించరాదని చెప్పింది. ఈమేరకు జస్టిస్ ఇ.వి.ఎం  గోపాల్ తీర్పు చెప్పారు.