ఆలయ భూములపై విచారణ చేస్తే ఇబ్బందేంటి?

ఆలయ భూములపై విచారణ చేస్తే ఇబ్బందేంటి?

దేవరయాంజల్ భూముల సర్వేపై  IASల కమిటీ ఏర్పాటు జీవో కొట్టివేయాలని కోరుతూ... సదా కేశవరెడ్డి పిటిషన్ పై విచారించింది హైకోర్టు. జీవో అమలు నిలిపివేసేందుకు నిరాకరించింది న్యాయస్థానం. ఆలయ భూములు గుర్తించేందుకు విచారణ చేస్తే ఇబ్బందేంటని ప్రశ్నించింది. విచారణ జరిపి నివేదిక ఇవ్వడం కమిటీ బాధ్యత అని తెలిపింది. దేవరయాంజల్ భూములపై విచారణ చేసే అధికారం కమిటీకి ఉందని స్పష్టం చేసింది హైకోర్టు. భూముల్లోకి వెళ్లే ముందు పిటిషనర్లకు నోటీసులు ఇవ్వాలని ఆదేశించింది. కమిటీకి అవసరమైన పేపర్లు, సమాచారం ఇవ్వాలని పిటిషనర్లకు తెలిపింది. పిటిషనర్లు విచారణకు సహకరించక పోతే అధికారులు చట్ట ప్రకారం చర్యలు తీసుకోవచ్చని తెలిపింది. మరోవైపు కౌంటర్ దాఖలు చేయాలని ప్రభుత్వానికి సూచించింది.