డాక్టర్లకు కరోనా సోకడంపై హైకోర్టు సీరియస్

డాక్టర్లకు కరోనా సోకడంపై హైకోర్టు సీరియస్

రాష్ట్రంలో వైద్యసిబ్బందికి కరోనా సోకడంపై హైకోర్టు సీరియస్ అయ్యింది. కరోనా వ్యాప్తి, టెస్టులకు సంబంధించి దాఖలైన పిటిషన్ పై విచారణ చేపట్టింది. డాక్టర్లకు పీపీఈ కిట్లు ఇవ్వలేదా అంటూ ప్రభుత్వాన్ని ప్రశ్నించింది. పీపీఈ కిట్లు ఇస్తే వైరస్ ఎలా సోకిందంటూ ఆగ్రహం వ్యక్తం చేసింది. దీనికి సంబంధించి ఈ నెల 8లోగా సమగ్ర నివేదిక సమర్పించాలని ప్రభుత్వాన్ని కోర్టు ఆదేశించింది.

రాష్ట్రంలో 34 మంది వైద్య సిబ్బందితో పాటు… ఓపీ చూస్తున్న జూనియర్ డాక్టర్లకు కూడా కరోనా వైరస్ సోకిందని..దీనికి ప్రభుత్వ నిర్లక్ష్యమే కారణమని పిటిషనర్ కోర్టుకు తెలిపారు.