వెస్ట్‌‌ జోన్‌‌ కమిషనర్‌‌కు ధిక్కార నోటీసులు జారీ

వెస్ట్‌‌ జోన్‌‌ కమిషనర్‌‌కు ధిక్కార నోటీసులు జారీ
  • జీహెచ్‌‌ఎంసీ వెస్ట్‌‌ జోన్‌‌ కమిషనర్‌‌కు హైకోర్టు ఆదేశం

హైదరాబాద్, వెలుగు: హైదరాబాద్‌‌ సిటీ రాయదుర్గ్‌‌ నాగా హిల్స్‌‌ రోడ్డు నిర్మాణానికి స్థలాన్ని తీసుకుని పరిహారం చెల్లించలేదన్న వ్యాజ్యంలో జీహెచ్‌‌ఎంసీ వెస్ట్‌‌ జోన్‌‌ కమిషనర్‌‌కు హైకోర్టు కోర్టు ధిక్కార నోటీసు జారీ చేసింది. జులై 18న తేదీన జరిగే విచారణకు స్వయంగా హాజరై వివరణ ఇవ్వాలని ఆదేశించింది. రంగారెడ్డి జిల్లా శేరిలింగంపల్లి మండలం రాయదుర్గంలోని నాగా హిల్స్‌‌లో రోడ్డు నిర్మాణం కోసం 267 చదరపు గజాల స్థలాన్ని జీహెచ్‌‌ఎంసీ సేకరించింది.

తన స్థలానికి పరిహారం చెల్లించాలన్న గత ఉత్తర్వులను అధికారులు ఉల్లంఘించి కోర్టుధిక్కరణకు పాల్పడ్డారంటూ స్థల యజమాని మహ్మద్‌‌ కాజం అలీ హైకోర్టును ఆశ్రయించారు. దీనిని చీఫ్‌‌ జస్టిస్‌‌ ఉజ్జల్‌‌ భూయాన్, జస్టిస్‌‌ ఎస్‌‌.నందలతో కూడిన డివిజన్‌‌ బెంచ్‌‌ గురువారం విచారించింది.