
హైదరాబాద్, వెలుగు : తామిచ్చిన ఆదేశాల్ని ఎందుకు అమలు చేయలేదో స్వయంగా కోర్టుకు వచ్చి వివరణ ఇవ్వాలని పలువురు ఐఏఎస్‌లను హైకోర్టు ఆదేశించింది. ఈ మేరకు బుధవారం పశుసంవర్థక శాఖ స్పెషల్ చీఫ్ సెక్రటరీ సబ్యసాచి ఘోష్, ఆర్థిక శాఖ ముఖ్య కార్యదర్శి సందీప్‌కుమార్ సుల్తానియా, మత్స్యశాఖ కమిషనర్ ప్రియాంక ఆలా, మత్స్యశాఖ డిప్యూటీ డైరెక్టర్ టి.శ్రీనివాస్, నాగర్‌కర్నూల్, వనపర్తి కలెక్టర్లలకు నోటీసులు జారీ చేసింది.
కోర్టు ధిక్కరణ చర్యలు ఎందుకు తీసుకోరాదో వివరణ ఇవ్వాలని చెప్పింది. ఈ నెల 30న జరిగే విచారణకు హాజరై.. వివరణ ఇవ్వాలని ఆదేశించింది. 2023-–24 ఏడాదికి ఫిష్ సీడ్స్ కు సంబంధించి చెల్లింపుల్లో అధికారులు జాప్యం చేస్తున్నారని పేర్కొంటూ ఓ వ్యక్తి కోర్టులో పిటిషన్ దాఖలు చేశాడు. ఆ మొత్తాన్ని 3 వారాల్లో చెల్లించాలాని కోర్టు ఆదేశించినా అధికారులు పట్టించుకోకపోవడంతో అధికారులకు నోటీసులిచ్చింది.