ఇండియాలో అత్యధిక కలెక్షన్లు రాబట్టిన ధురంధర్-2 సినిమా వివాదంలో చిక్కుకున్నట్లే కనిపిస్తోంది. ఆ సినిమాలో ఉన్న కంటెంట్ ను పరిశీలించాల్సిందిగా ఢిల్లీ హైకోర్టు 2026 మే 20వ తేదీన కేంద్రాన్ని ఆదేశించడం చర్చనీయాంశంగా మారింది. ధురంధర్ : ది రివెంజ్ లో ఇండియన్ మిలిటరీ, ఇంటెలిజెన్స్ ఆపరేషన్స్ కు సంబంధించిన సీక్రెట్స్ లీక్ అయ్యాయేమో పరిశీలించాల్సిందిగా కేంద్రంతో పాటు సెంట్రల్ బోర్డ్ ఆఫ్ ఫిలిం సర్టిఫికేషన్ (సీబీఎఫ్సీ) ని ఆదేశించింది కోర్టు.
జస్టిస్ దేవేంద్ర కుమార్ ఉపాధ్యాయ, జస్టిస్ తేజస్ కరియాలతో కూడిన బెంచ్.. ఈ అంశంపై నమోదైన పిటీషన్ ను విచారించింది. పిటీషనర్ వాదన ప్రకారం.. ఆ సినిమాలో దేశభద్రతకు సంబంధించిన రహస్యాలు వెల్లడి చేశారేమో పరిశీలించాల్సిందిగా ఆదేశించింది. సినిమాలో ఫిక్షనల్, ఎంటర్టైన్మెంట్ కంటెంట్ ఉన్నప్పటికీ.. అలాంటి ఉల్లంఘనలు ఏమైనా జరిగాయేమో చూడాలని సూచించింది.
కేంద్ర హోంమంత్రిత్వ శాఖ ఆధ్వర్యంలో నడిచే సెంట్రల్ ఆర్మ్డ్ ఫోర్స్ సశస్త్ర సీమా బల్ (SSB) వింగ్ ఉద్యోగి దీపక్ కుమార్ ఈ పిటీషన్ వేశారు. ఢిల్లీలోని ఆర్కే పురం SSB హెడ్ క్వార్టర్స్ లో పనిచేస్తున్న దీపక్ కుమార్.. ధురంధర్ సినిమాలో కొన్ని సీన్స్ మిలిటరీ ఆపరేషన్ మెథడ్స్, ఇంటెలిజెన్స్ సంబంధించిన అంశాలను వెల్లడించినట్లు పేర్కొన్నారు. అవి దేశ భద్రతకు ముప్పు వాటిల్లే ప్రమాదం ఉంటుందని పేర్కొన్నారు.
►ALSO READ | PEDDI Censor: U/A సర్టిఫికేట్‌తో ‘పెద్ది’ రిలీజ్‌కు రెడీ.. 12 ఏళ్లు దాటనోళ్లు మూవీ చూడొచ్చా!
ఆర్మీ చేసే ఆపరేషన్స్ ఉన్నవి ఉన్నట్లుగా తెరకెక్కించినట్లు పిటీషన్ లో పేర్కొ్న్నారు. అండర్ కవర్ ఆపరేషన్స్, భారత ఏజెన్సీల వ్యూహాలను వెల్లడించడం మూలంగా శత్రువులకు అవకాశం ఇచ్చినట్లు అవుతుందని పేర్కొ్నారు.
ఆదిత్య ధర్, రణ్ వీర్ సింగ్ కాంబినేషన్ లో వచ్చిన ధురంధర్ ఇండియన్ హిస్టరీలోనే అతిపెద్ద విజయం నమోదు చేసిన విషయం తెలిసిందే. మొదటి 2025 డిసెంబర్ లో రిలీజ్ అవ్వగా.. ప్రపంచ వ్యాప్తంగా 1328 కోట్ల కలెక్షన్లు రాబట్టింది. ఇక రెండో భాగం 2026 మార్చి లో రిలీజై.. 1800 కోట్ల కలెక్షన్లతో రికార్డులను బ్రేక్ చేసింది.
