
హైదరాబాద్, వెలుగు: మెదక్ జిల్లా నర్సాపూర్ మండలం చిప్పలతుర్తిలో వందల కోట్ల విలువైన 112 ఎకరాల భూమిలో వేసిన లేఅవుట్స్, అందుకు అధికారుల నుంచి పొందిన అనుమతుల వివరాలు ఇవ్వాలని సదరు గ్రామ పంచాయతీకి హైకోర్టు నోటీసులిచ్చింది.
చిప్పలతుర్తిలో సర్వే నం.58/1 నుంచి 5, 12, 59/30, 31, 32, 40లోని 112 ఎకరాల భూమి విషయంలో చట్టవిరుద్ధమైన ఎంట్రీలు నమోదై ఉన్నాయని, వాటిపై దర్యాప్తు జరపాలని అధికారులకు వినతిపత్రం ఇచ్చినా చర్యలు తీసుకోలేదంటూ జి.అశోక్ తోపాటు ఇతరులు పిటిషన్ వేశారు. దీన్ని జడ్జి జస్టిస్ కే లక్ష్మణ్ బుధవారం విచారించి గ్రామ పంచాయతీకి నోటీసులిచ్చారు. విచారణను ఈ నెల 22కి వాయిదా వేశారు.