కోర్టు ధిక్కరణ పిటిషన్లో సీఎస్కు హైకోర్టు నోటీసులు

కోర్టు ధిక్కరణ పిటిషన్లో సీఎస్కు హైకోర్టు నోటీసులు

హైదరాబాద్, వెలుగు: కోర్టు ధిక్కరణ పిటిషన్​లో సీఎస్​కు హైకోర్టు నోటీసులు ఇచ్చింది. రాష్ట్రవ్యాప్తంగా జిల్లా మత్స్యకారుల సహకార సంఘాలకు ఎన్నికలు నిర్వహించాలన్న ఆదేశాలను అమలు చేయకపోవడంపై దాఖలైన కోర్టు ధిక్కరణ పిటిషన్‌‌లో సీఎస్‌‌తోపాటు పశుసంవర్ధకశాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి, సహకార శాఖ ముఖ్యకార్యదర్శి, మత్స్యశాఖ ఎండీ తదితరులకు నోటీసులిచ్చింది. 

హైకోర్టు ఆదేశాలను ఎందుకు అమలు చేయలేదో పూర్తి వివరాలతో కౌంటర్లు దాఖలు చేయాలని ఆదేశించింది. 21 జిల్లాలోని గ్రామ, జిల్లాల ప్రాథమిక మత్స్యకారుల సహకార సంఘాలకు ఎన్నికలు నిర్వహించాలని సెప్టెంబర్​లో జారీ చేసిన ఆదేశాలను అమలు చేయకపోవడంపై బి.మల్లేశం మరికొందరు హైకోర్టులో కోర్టు ధిక్కరణ పిటిషన్‌‌ వేశారు. దీనిని జస్టిస్‌‌ టి.మాధవీదేవి విచారణ చేపట్టారు. కాగా, వాదనలను విన్న న్యాయమూర్తి సీఎస్‌‌తో పాటు ఇతర అధికారులకు నోటీసులు జారీ చేస్తూ విచారణను నవంబర్​ 14కు వాయిదా వేశారు.