వెంకటాపూర్ (రామప్ప), వెలుగు: యునెస్కో గుర్తింపు పొందిన రామప్ప టెంపుల్ ను హై కోర్టు జడ్జి ఈవీ వేణుగోపాల్, హనుమకొండ జిల్లా ఎలక్షన్ అబ్జర్వర్ శివకుమార్ నాయుడు శనివారం సందర్శించారు. వారికి ఆలయ అర్చకులు, అధికారులు పూర్ణకుంభంతో స్వాగతం పలికారు.
అనంతరం ప్రత్యేక పూజలు నిర్వహించి, తీర్థప్రసాదాలు అందజేశారు. ఈవో బిల్లా శ్రీనివాస్ సత్కరించారు. టూరిజం గైడ్ విజయకుమార్ ఆలయ విశిష్టతను వివరించారు. వారి వెంట ములుగు, భూపాలపల్లి జిల్లా జడ్జిలు సూర్య చంద్రకళ, రమేశ్‌బాబు, సీనియర్ సివిల్ జడ్జి కన్నయ్య లాల్, ప్రిన్సిపాల్ జూనియర్ సివిల్ జడ్జి జోత్స్న, దిలీప్ నాయక్, తహసీల్దార్ గిరి బాబు తదితరులున్నారు.
