
ఆంధ్రప్రదేశ్ : పోలవరం రివర్స్ టెండరింగ్‌పై ఏపీ హైకోర్టు కీలక తీర్పు చెప్పింది. హైడల్ ప్రాజెక్ట్ రివర్స్ టెండరింగ్‌ను నిలిపేయాలంటూ హైకోర్టు మధ్యంతర ఉత్వర్వులు ఇచ్చింది. టెండరింగ్ ప్రక్రియపై ముందుకు వెళ్లవద్దని స్పష్టమైన ఆదేశాలిచ్చింది. పోలవరం హైడల్ ప్రాజెక్ట్ టెండర్ రద్దుపై నవయుగ కంపెనీ హైకోర్టును ఆశ్రయించడంతో.. అదేరోజు ఇరు వర్గాల వాదనను విన్న కోర్టు.. తీర్పు చెప్పింది. హైడల్ ప్రాజెక్టు టెండర్ రద్దు విషయంలో ప్రభుత్వం వాదనను కోర్టు తోసిపుచ్చింది.
ఇప్పటివరకు ఎటువంటి ఉల్లంఘనలకు పాల్పడకుండా తాము టెండరింగ్ పనులు చేపట్టామని.. అలాంటిది అకారణంగా తమ కాంట్రాక్టు రద్దు చేశారని కోర్టు ముందు నవయుగ తమ వాదనను వినిపించింది. హైడల్ ప్రాజెక్ట్ నిర్మాణం విషయంలో ఏపీజెన్‌కో తమకు స్థలాన్ని చూపించకపోవడం వల్లే ముందుకు వెళ్లలేకపోయామని నవయుగ కోర్టుకు తెలిపింది.
ప్రభుత్వం తీరు వల్లే ఈ ఆలస్యం జరిగిందనీ… తమ వల్ల పనుల్లో ఆలస్యం జరగలేదని నవయుగ తెలిపింది. తమ కాంట్రాక్టును తిరిగి కొనసాగించేలా ఆదేశాలివ్వాలని కోర్టుకు విజ్ఞప్తి చేసింది.
పోలవరం నీటిపారుదల ప్రాజెక్టుకు సంబంధించి రూ.4,987 కోట్లతో రివర్స్ టెండరింగ్‌కు రీసెంట్ గా వైఎస్ జగన్ ప్రభుత్వం నోటిఫికేషన్ రిలీజ్ చేసింది. పోలవరం ప్రాజెక్టు పనుల్లో రూ.3,600 కోట్ల మేర అంచనాలు పెరిగాయని నిపుణుల కమిటీ ఇచ్చిన నివేదిక ఆధారంగానే రివర్స్ టెండరింగ్‌కు వెళ్లినట్టు ప్రభుత్వం తెలిపింది. రివర్స్ టెండరింగ్ ద్వారా ఖజానాపై భారం తగ్గుతుందని జగన్ ప్రభుత్వం చెబుతోంది.