చేపల మృతికి కారణాలు చెప్పండి..రాష్ట్రానికి హైకోర్టు నోటీసులు

చేపల మృతికి కారణాలు చెప్పండి..రాష్ట్రానికి హైకోర్టు నోటీసులు

హైదరాబాద్, వెలుగు : హైదరాబాద్‌‌‌‌‌‌‌‌ శివార్లలోని పఠాన్‌‌‌‌‌‌‌‌చెరువులో చిట్కూల్‌‌‌‌‌‌‌‌ చెరువులో కాలుష్యంతో టన్నుల కొద్ది చేపలు మృతి చెందాయంటూ పత్రికల్లో వచ్చిన వార్తలను హైకోర్టు సుమోటో పిల్‌‌‌‌‌‌‌‌గా స్వీకరించింది. చేపల మృతిపై కౌంటర్లు దాఖలు చేయాలని రాష్ట్ర ప్రభుత్వానికి నోటీసులు ఇచ్చింది. దాదాపు10 టన్నుల చేపలు చనిపోవడంతో సుమారు కోటి రూపాయల దాకా నష్టం వాటిల్లిందని, ఆ పరిసరాల్లో పరిశ్రమలు చెరువులోకి కాలుష్యాన్ని వదిలిపెట్టడంతోనే ఈ సంఘటన జరిగిందని పత్రికల్లో వార్తలు వచ్చాయి.

గతంలోను ఇదే విధంగా జరిగిందని పేర్కొంది. చేపలు పట్టుకుంటూ100 కుటుంబాలు జీవనాన్ని కొనసాగిస్తున్నాయనే పిల్‌‌‌‌‌‌‌‌ను చీఫ్‌‌‌‌‌‌‌‌ జస్టిస్‌‌‌‌‌‌‌‌ అలోక్‌‌‌‌‌‌‌‌ అరాధే, జస్టిస్‌‌‌‌‌‌‌‌ జె.అనిల్‌‌‌‌‌‌‌‌కుమార్‌‌‌‌‌‌‌‌లతో కూడిన డివిజన్‌‌‌‌‌‌‌‌ బెంచ్‌‌‌‌‌‌‌‌ సోమవారం విచారించింది. ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి, పశుసంవర్ధకశాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి, పర్యావరణ, అటవీ శాఖ ముఖ్యకార్యదర్శి, కాలుష్య నియంత్రణ మండలి, సంగారెడ్డి కలెక్టర్, మత్స్యశాఖ కమిషనర్, జిల్లా మత్స్యశాఖాధికారి, రాష్ట్ర న్యాయసేవాధికార సంస్థ మెంబర్‌‌‌‌‌‌‌‌ సెక్రటరీలకు నోటీసులు ఇచ్చింది. విచారణను ఈ నెల 16కు వాయిదా వేసింది.