
హైదరాబాద్, వెలుగు: రంగారెడ్డి జిల్లా ఖానాపూర్‌లోని 20 ఎకరాల పట్టా భూమికి పాస్బుక్ ఇవ్వాలని కోరుతూ ప్రతాప్ జంగిల్ రిసార్ట్స్ ప్రైవేట్ లిమిటెడ్ చేసుకున్న దరఖాస్తును మరోసారి పరిశీలించాలని గండిపేట తహసీల్దారును హైకోర్టు ఆదేశించింది. భూములు ప్రభుత్వానివేనంటూ రంగారెడ్డి జేసీ 2013 సెప్టెంబర్‌లో జారీ చేసిన భూముల రిజిస్ట్రేషన్ నిషేధిత జాబితా గమనంలోకి తీసుకోవద్దంది. సర్వే నంబర్ 45 భూమి పాస్బుక్ కోసం రెండేళ్ల క్రితమే దరఖాస్తు చేసుకున్నామని కోర్టులో వ్యాజ్యం దాఖలైంది.
నిషేధిత జాబితా నుంచి ప్రతాప్ జంగిల్స్రిసార్ట్స్ భూములను తప్పించాలని అందులో పేర్కొన్నారు. విచారణ తర్వాత 4 వారాల్లో పిటిషనర్ దరఖాస్తును పరిశీలించి పాస్ పుస్తకాల జారీపై నిర్ణయం తీసుకోవాలని హైకోర్టు ఆదేశించింది.