మరియమ్మ లాకప్ డెత్ CBIకి అప్పగించాల్సిన కేసు

మరియమ్మ లాకప్ డెత్ CBIకి అప్పగించాల్సిన కేసు

మరియమ్మ లాకప్ డెత్ ఇష్యూపై ఇవాళ హైకోర్టులో విచారణ జరిగింది. మరియమ్మ మృతిపై కోర్టుకు నివేదిక ఇచ్చారు మెజిస్ట్రేట్. విచారణ సందర్భంగా కీలక వ్యాఖ్యలు చేసింది హైకోర్టు. ఈ కేసును CBIకు అప్పగించదగినది అంటూ కామెంట్ చేసింది. బాధ్యులపై ఎలాంటి క్రిమనల్ చర్యలు తీసుకున్నారని ప్రశ్నించింది. బాధిత కుటుంబానికి పరిహాం ఇచ్చామని ఏజీ ప్రసాద్ సమాధానమిచ్చారు.అంతేకాదు.. ఎస్ఐ, కానిస్టేబుల్ ను ఉద్యోగం నుంచి తొలగించినట్లు తెలిపారు. అయితే పరిహారం ప్రాణాలను తీసుకురాలేదని హైకోర్టు వ్యాఖ్యనించింది. ఈ నెల 22న విచారణకు రావాలని CBI ఎస్పీకి హైకోర్టు నోటీసులు ఇచ్చింది. కేసు పూర్తి వివరాలు అడిషనల్ సొలిసిటర్ జనరల్ కు ఇవ్వాలని ఏజీని ఆదేశించింది. కేంద్రంతో పాటు CBIను ప్రతివాదులుగా చేర్చింది. తదుపరి విచారణను ఈనెల 22కు వాయిదా వేసింది.